Short News

మా ఎమ్మెల్యే కన్పించడంలేదు..ఆచూకి చెబితే రూ.101 బహుమానం!

మా ఎమ్మెల్యే కన్పించడంలేదు..ఆచూకి చెబితే రూ.101 బహుమానం!

మా నియోజకవర్గ ఎమ్మెల్యే తప్పిపోయారు.. ఆచూకీ తెలిపిన వారికి అక్షరాల రూ.101 బహమానం ఇస్తామని స్థానికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్దానా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సింగ్‌ సోమ్‌పై ఈ పోస్టులు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి కనిపించడం లేదంటున్నారు. ఎమ్యెల్యే తన నియోజకవర్గంలో శాంతి భద్రతలను విస్మరించారని ఆక్రందనతో పెట్టిన పోస్ట్‌ ఇది. ఇటీవల తమ ప్రాంతానికి చెందిన 14ఏళ్ల బాలికపై కిరోసిన్‌‌ పోసి నిప్పటించిన ఆకతాయిలను పట్టించుకోలేదని ఆవేదనతో పంపిన సందేశమిది.
విశాల్ నటించిన‘అభిమన్యుడు’ డైరెక్టర్ కు భారీ ఆఫర్

విశాల్ నటించిన‘అభిమన్యుడు’ డైరెక్టర్ కు భారీ ఆఫర్

పీఎస్ మిత్రన్ డైరెక్టర్‌ తొలిచిత్రం ‘అభిమన్యుడు’. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ డైరెక్టర్ తాజాగా భారీ ఆఫర్ అందుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. 24 ఏఎం స్టూడియోస్ బ్యానర్‌పై హెచ్‌డీ రాజా నిర్మించనున్న సినిమాకు మిత్రన్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్. శివకార్తీకేయన్ హీరోగా నటించనున్నాడు. శివకార్తీకేయన్ నటించిన ‘సీమరాజా' చిత్రం తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది.
కౌశల్ కూతుర్ని వివాదంలోకి లాగిన గీతా.. బిగ్‌బాస్ కాబట్టి వదిలేస్తున్నా.. బయట సంగతి చూస్తా.. తనీష్

కౌశల్ కూతుర్ని వివాదంలోకి లాగిన గీతా.. బిగ్‌బాస్ కాబట్టి వదిలేస్తున్నా.. బయట సంగతి చూస్తా.. తనీష్

బిగ్‌బాస్‌లో 101వ రోజు గందరగోళంగా ముగిసింది. సెప్టెంబర్ 20న నా కూతురు బర్త్ డే.. కాబట్టి ఓ ఐదు నిమిషాలు పంపిస్తే.. కేక్ కట్ చేసి వెంటనే తిరిగి పంపిస్తాను అని నానికి గత ఆదివారం కౌశల్ చేసిన రిక్వెస్ట్‌పై గీతా, సామ్రాట్, దీప్తి, రోల్ రైడా, తనీష్ చర్చించుకొన్నారు. కౌశల్ కూతురు విషయం పెద్ద వాగ్వాదానికి దారి తీసింది. కౌశల్ కూతురు బూస్టింగ్ అంశాలపై కౌశల్, ఐదుగురు ఇంటి సభ్యుల మధ్య భారీగా మాటలు విసురుకొన్నారు. కౌశల్‌పై ఇంటి సభ్యులందరూ మాటలతో దాడికి దిగడంతో కౌశల్ ఆవేశంతో ఊగిపోయాడు. దాంతో ఐదుగురు సభ్యులపై అరిచాడు.

ల‌వ్ రాత్రిని 'ల‌వ్ యాత్రి'గా మార్చారు

ల‌వ్ రాత్రిని 'ల‌వ్ యాత్రి'గా మార్చారు

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ బావ మరిది ఆయుష్‌ శర్మ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్‌ రాత్రి'. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. హిందువులు పవిత్రంగా జరపుకొనే దేవీ నవరాత్రులను అవమానిస్తున్నట్లుగా టైటిల్‌ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాంతో సల్మాన్‌ సినిమా టైటిల్‌లో మార్పులు చేస్తూ కొత్త టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఇందులో ఎలాంటి అక్షర దోషం లేదు. సినిమా టైటిల్‌ను ‘లవ్‌యాత్రి'గా మార్చాం' అని సల్మాన్‌ ట్వీట్‌ చేశారు.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more