Short News

220 ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన డీఐ

220 ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన డీఐ

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖలో 220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగ్జామినర్ (పేటెంట్ అండ్ డిజైన్) పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 4 సెప్టెంబర్, 2018.


సంస్థ పేరు : డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్
మొత్తం పోస్టు సంఖ్య : 220
పోస్టు పేరు : ఎగ్జామినర్
జాబ్ లొకేషన్ : దేశ వ్యాప్తంగా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 4 సెప్టెంబర్ 2018

సిటీ బ్యాంక్‌లో భారీ క్రెడిట్‌ కార్డుల మోసం

సిటీ బ్యాంక్‌లో భారీ క్రెడిట్‌ కార్డుల మోసం

ఢిల్లీలో భారీ క్రెడిట్‌ కార్డు మోసం వెలుగులోకి వచ్చింది. కన్నాట్‌ ప్లేస్‌లో ఉన్న సిటీ బ్యాంక్‌లో మోసగాళ్ళు సేవింగ్స్‌ ఖాతాలు తెరిచి క్రెడిట్‌ కార్డులు పొంది పూర్తిగా వాడేసుకుని బిల్లులు చెల్లించుకుండా పారిపోయారు. ఇలా బ్యాంక్‌కు రూ.2.4 కోట్ల క్రెడిట్‌ కార్డుల బకాయిలను చెల్లించలేదు. ఇలాంటివి మొత్తం 36 కేసులు నమోదయినట్లు బ్రాంచ్‌ తెలిపింది. తప్పుడు అడ్రస్‌లతో కస్టమర్లు క్రెడిట్‌ కార్డులు పొందారని, ఎన్‌సీఆర్‌లో పలు ప్రాంతాల్లో వీరు ఈ కార్డులను స్వైప్‌ చేసినట్టు పేర్కొన్నారు. దీనిపై పోలీసుల వద్ద ఫిర్యాదు దాఖలు చేసారు. 
సూర్య గొప్ప మనసు: అభిమాని కోరిక తీర్చి... ఖర్చు భరిస్తానని హామీ!

సూర్య గొప్ప మనసు: అభిమాని కోరిక తీర్చి... ఖర్చు భరిస్తానని హామీ!

సౌతిండియా స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కేవలం నటన మాత్రమే కాదు, సేవా గుణం, అభిమానుల పట్ల చూపించే ప్రేమ... ఆయన్ను ఇంత గొప్పస్థాయికి తీసుకొచ్చిందని చెబుతుంటారు. తాజాగా మరోసారి సూర్య తన పెద్ద మనసు చాటుకున్నారు. జబ్బుతో బాధ పడుతున్న కెవి దినేష్ అనే బాలుడు తన అభిమాన హీరోను కలవాలని ఆశపడటంతో ఈ విషయం ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా తెలుసుకున్న సూర్య అతడిని తన ఇంటికి పిలిపించుకుని కలిశారు. ఈ సందర్భంగా దినేష్‌కు సూర్య పలు కానుకలు అందించారు.

జాతీయ మాతగా 'ఆవు' ..బిల్లుకు ఆమోదం

జాతీయ మాతగా 'ఆవు' ..బిల్లుకు ఆమోదం

ఆవును జాతీయ మాతగా గుర్తించాలంటూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తీర్మానించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్‌ పశు సంవర్ధక శాఖ మంత్రి రేఖ ఆర్య ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రేఖ ఆర్య మాట్లాడుతూ 'ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఉన్న ఆవును జాతి మాత (మదర్‌ ఆఫ్‌ ద నేషన్‌)గా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా చేయడం వల్ల గో సంరక్షణ ప్రయత్నాలు మరింత బలపడతాయి. ఆవును జాతి మాతగా గుర్తించే బిల్లును ప్రవేశ పెట్టాం. ప్రతిపక్షం కూడా దీనికి పూర్తి మద్దతు తెలిపింది' అని ప్రకటించారు. 
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more