Short News

కేరళలో వర్షాలు, వరదలు.. స్తంభించిన జనజీవనం

కేరళలో వర్షాలు, వరదలు.. స్తంభించిన జనజీవనం

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో సగం భాగం ఇప్పుడు జలమయం అయ్యింది. కేరళలో మరో వారం రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. వర్షాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 29కి చేరుకున్నది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానల వల్ల ఇంకా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల వల్ల కొచ్చిలో తాగునీటి సమస్య ఏర్పడింది.
విజయ్, రష్మికలు సహజంగా చేసారు

విజయ్, రష్మికలు సహజంగా చేసారు

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ విజయ్, రష్మిక, వెన్నెల కిషోర్‌ నటనకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ సినిమా ట్విటర్ ద్వారా చిత్రబృందాన్ని మెచ్చుకున్నాడు. 'అర్జున్ రెడ్డి' తర్వాత పర్ఫెక్ట్ సినిమా ఇది. విజయ్, రష్మికల సహజ నటనను చూడటం ట్రీట్‌లా అనిపించింది. పరుశురామ్‌కి, టెక్నీషియన్స్‌కి, ఆర్టిస్టులకి, జీఏ2 పిక్చర్స్ టీమ్‌కి అభినందనలు' అని పేర్కొన్నాడు.
విజయ్ తో అట్లీ మరో ప్రాజెక్టు

విజయ్ తో అట్లీ మరో ప్రాజెక్టు

కోలీవుడ్ నటుడు విజయ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలుగా 'తెరి', 'మెర్సల్' నిలిచాయి. విజయ్ కి ఈ స్థాయి సక్సెస్ లను ఇచ్చిన దర్శకుడు అట్లీ కుమార్. విజయ్ తో మరో సినిమా చేయడానికి అట్లీ కుమార్ రెడీ అవుతున్నాడు. విజయ్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నాననీ .. ఇంతవరకూ విజయ్ చేసిన చిత్రాలకి ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని అట్లీ కుమార్ చెప్పాడు. గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'తెరి' .. 'మెర్సల్' సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని అన్నాడు. తమ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని చెప్పుకొచ్చాడు.
రణ్‌వీర్‌-దీపికల పెళ్ళిలో నో 'సెల్‌ఫోన్లు'.!

రణ్‌వీర్‌-దీపికల పెళ్ళిలో నో 'సెల్‌ఫోన్లు'.!

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొణే త్వరలోనే పెళ్ళిపీటలెక్కబోతున్నారు. వీరిద్దరూ నవంబర్‌ 20న వివాహ బంధంతో ఒక్కటవుతారని ప్రచారం సాగుతోంది. ఇటలీలోని కోమో సరస్సు వివాహ వేడుకకు వేదికగా నిలవబోతుంది. 30 మంది కంటే ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించకూడదని దీపికా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే వేడుకలో భాగం కాబోతున్నారట. వీరి వివాహ వేడుకకు సెల్‌ ఫోన్లు అనుమతించకూడదని కూడా నిర్ణయించారట. వేడుకను చాలా ప్రైవసీగా ఉంచాలని అభిప్రాయపడుతున్నారట.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more