Short News

మహానేతను చూసేందుకు తరలివస్తున్న ప్రజలు

మహానేతను చూసేందుకు తరలివస్తున్న ప్రజలు

దివంగత కరుణానిధి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్‌కు తరలించారు. ప్రియతమ నేతను కడసారి చూసేందుకు తండోప తండాలుగా ప్రజలు చెన్నైకు తరలివస్తున్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత కరుణానిధికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరుణకు అంజలి ఘటించేందుకు పలువురు నేతలు చెన్నైకు రానున్నారు. ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు తరలివస్తున్నట్లు డీఎంకే వర్గాలు తెలిపాయి.
జయలలిత బయోపిక్: ఆ వివాదాలు, కేసులపైనే అందరి దృష్టి!

జయలలిత బయోపిక్: ఆ వివాదాలు, కేసులపైనే అందరి దృష్టి!

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత జీవితం ఆధారంగా త్వరలో బయోపిక్ రాబోతోంది. ఈ సినిమాను ఆమె జయంతి సందర్బంగా ఫిబ్రవరి 24, 2019న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే రోజున ఫస్ట్ లుక్‌తో కూడిన టైటిల్ పోస్టర్ విడుదల చేయబోతున్నారు. 'మద్రాసి పట్టణం' మూవీకి దర్శకత్వం వహించిన తమిళ ఫిల్మ్ మేకర్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

నాపై జగన్ కక్ష:యరపతినేని.మోడీకి అసూయ:పుల్లారావు

నాపై జగన్ కక్ష:యరపతినేని.మోడీకి అసూయ:పుల్లారావు

తనను రాజకీయంగా ఎదుర్కోలేక వైసిపి ఇలా కుట్ర చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో ప్రజల సమక్షంలోనే వైసిపి సంగతి తేలుస్తామని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్,వైసిపిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సరస్వతీ భూముల విషయంలో తాను రైతులకు అండగా ఉన్నందుకే జగన్‌ తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. వైసిపి వల్లే పల్నాడులో 25 వేల మంది క్వారీ కార్మికులు రోడ్డున పడ్డారని యరపతినేని ఆరోపించారు. వైసిపి నిజ నిర్ధారణ కమిటీలో అందరూ దోపిడీ దొంగలేనని యరపతినేని దుయ్యబట్టారు.

మదర్సాలో జాతీయ గీతానికి అవమానం

మదర్సాలో జాతీయ గీతానికి అవమానం

72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మహారాజ్‌గంజ్‌లోని ఓ మదర్సా కేంద్రంలో జాతీయ గీతాన్ని అవమానించారు. విద్యార్థులందరూ జాతీయ గీతం ఆలపిస్తుండగా.. మదర్సా నిర్వాహకులు జాతీయగీతాన్ని ఆలపించొద్దని మధ్యలోనే అడ్డుకున్నారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడున్న కొందరు వీడియో తీసి వైరల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవడంతో.. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ కేసులో ఒక టీచర్‌ను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more