Short News

ఇటాలియన్ లేడీ డీజేపై ఎయిరిండియా సిబ్బంది దాడి!

ఇటాలియన్ లేడీ డీజేపై ఎయిరిండియా సిబ్బంది దాడి!

తనపై దాడి చేశారంటూ ఓ ఇటాలియన్ మహిళా డీజే.. ఎయిరిండియా సిబ్బందిపై ఆరోపణలు చేశారు. విమానం ఆలస్యంపై ప్రశ్నించిన సదరు విదేశీ మహిళపై చేయిచేసుకున్నారట. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది దురుసు ప్రవర్తనపై ఆమె ఏడుస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, తాము మాత్రం ఎలాంటి దాడులకు పాల్పడలేదని ఎయిరిండియా చెబుతోంది. కాగా, ఘటనపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు.

‘మహానటి’లో నా పాత్రను మహిళా ప్రేక్షకులు అసహ్యించుకుంటున్నారు

‘మహానటి’లో నా పాత్రను మహిళా ప్రేక్షకులు అసహ్యించుకుంటున్నారు

మహానటి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్. కార్వాన్ చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. అయితే మహానటి' చూసి కొందరు మహిళా అభిమానులు సోషల్‌ మీడియాలో ‘ఐ హేట్‌ యూ' అని కామెంట్లు పెట్టారు. నా పాత్ర నెగెటివ్‌గా ఉండటంవల్ల అలా స్పందించారు. ఒకేలాంటి సినిమాల్ని చేస్తూ పోతే ఎక్కువ సినిమాలు చేయలేను. ఆ సినిమాలో నాది నెగెటివ్‌ రోలే కానీ అది చాలా కీలకమైనది. నేను చేసిన సినిమా హిట్‌ అవ్వాలని కాదు, ఒక మంచి సినిమాలో నేను ఉండాలని కోరుకుంటాను'' అని చెప్పుకొచ్చాడు.
చిత్తయిన దాయాదులు ..'జయహో' భారత్

చిత్తయిన దాయాదులు ..'జయహో' భారత్

ఆసియా కప్‌ సూపర్ ఫోర్లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్ళు దుమ్మురేపారు. పాక్ నిర్దేశించిన 238 పరుగుల లక్ష్యాన్ని భారత్ 39.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేధించింది. శిఖర్ ధావన్ 114 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ 111 పరుగులు చేసాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (78), సర్ఫరాజ్ అహ్మద్ (44), ఆసిఫ్ అలీ (30) ఫఖర్ జమాన్ (31) పరుగులు చేసారు. భారత్ బౌలర్లలో బుమ్రా, చాహల్, కుల్దీప్ తలో రెండు వికెట్లు తీసారు.
కోలీవుడ్ కి ఆర్ఎక్స్ 100 హీరోయిన్..ఉదయనిధి స్టాలిన్ తో రొమాన్స్

కోలీవుడ్ కి ఆర్ఎక్స్ 100 హీరోయిన్..ఉదయనిధి స్టాలిన్ తో రొమాన్స్

అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అడల్ట్ చిత్రం ఆర్ ఎక్స్ 100. చిత్రంలో హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ కేవ‌లం త‌న గ్లామ‌ర్‌తోనే కాక బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో జీవించింది. పాయ‌ల్ పాత్ర‌ని ఎంతో మంది రిజెక్ట్ చేసిన డేరింగ్‌గా తాను ముందుకు వ‌చ్చి ఇచ్చిన పాత్ర‌కి న్యాయం చేసింది. ఇప్పుడు ఈ అమ్మ‌డిని వ‌రుస ఆఫ‌ర్స్ ప‌ల‌కరిస్తున్నాయి. తాజాగా పాయ‌ల్‌కి ఓ కోలీవుడ్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట. తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న ‘ఏంజెల్' అనే చిత్రంలో పాయల్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా ఆనంది మరో కథానాయికగా నటించనుంది. ఇమ్మాన్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more