Short News

లాలూకు ఒకే రోజు రెండు ఎదురు దెబ్బ‌లు

లాలూకు ఒకే రోజు రెండు ఎదురు దెబ్బ‌లు

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు శుక్రవారం రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు తాత్కాలిక బెయిలు గడువును పొడిగించేందుకు జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు ఐఆర్‌సీటీసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. వైద్య చికిత్స కోసం మూడు నెలలపాటు బెయిలును పొడిగించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని జార్ఖండ్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 30 లోగా లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. లాలూ ప్ర‌స్తుతం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   
ఆసియాకప్: చెలరేగిన ఆఫ్గాన్ కుర్రాళ్లు..భారత్ లక్ష్యం 253

ఆసియాకప్: చెలరేగిన ఆఫ్గాన్ కుర్రాళ్లు..భారత్ లక్ష్యం 253

ఆసియాకప్ సూపర్-4లో భాగంగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు చెలరేగారు. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేశారు. ఓపెనర్ మహ్మద్ షెజాద్(103 నాటౌట్: 88 బంతుల్లో 10ఫోర్లు, 6సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో షెజాద్ బ్యాటింగ్ మ్యాచ్‌కే హైలెట్. కెరీర్‌లో అతనికిది ఐదో శతకం కావడం విశేషం.మైదానం నలువైపులా బౌండరీలతో విరుచుకుపడ్డాడు.ఆఖర్లో ఆల్‌రౌండర్ నబీ కీలక సమయంలో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా(3),కుల్దీప్ యాదవ్(2),కేదార్ యాదవ్(1) అఫ్గాన్‌ను కట్టడి చేశారు.
అవే దేశానికి పట్టిన చీడపరుగులు: నరేంద్ర మోడీ

అవే దేశానికి పట్టిన చీడపరుగులు: నరేంద్ర మోడీ

దేశంలో అభివృద్ధిలో వెనుకబడడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్‌లో ఓటు బ్యాంకు రాజకీయాలు సమాజాన్ని చీడపురుగుల్లా నాశనం చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మనదేశం కంటే ఇతర దేశాలపై ప్రేమ ఎక్కువని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ భోపాల్‌లో 'కార్యకర్తల మహాకుటుంబ ర్యాలీ' నిర్వహించింది. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు.

ఆ సినిమా చూసి స్మగ్లర్ అయిపోదామనుకున్నా.. ఆయన్ని చూడడమే అదృష్టం అనుకుంటే!

ఆ సినిమా చూసి స్మగ్లర్ అయిపోదామనుకున్నా.. ఆయన్ని చూడడమే అదృష్టం అనుకుంటే!

దిగ్గజ దర్శకుడు చాలా గ్యాప్ తరువాత పవర్ ఫుల్ కథతో రాబోతున్నాడు. మణిరత్నం తెరక్కించిన భారీ చిత్రం నవాబ్ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్ర తెలుగు వర్షన్ కు అశోక్ వల్లభనేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాను నిక్కర్ నుంచి ప్యాంటులోకి మారుతున్న వయసులో మణిరత్నం నాయకుడు చిత్రం విడుదలయింది. ఆ చిత్రాన్ని 30 సార్లు చూశానని అశోక్ వల్లభనేని అన్నారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more