Short News

ఆస్పత్రి నుంచి లాలూ ప్రసాద్ డిశ్చార్జ్

ఆస్పత్రి నుంచి లాలూ ప్రసాద్ డిశ్చార్జ్

ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఉన్నట్టుండి ఆయన అస్వస్థతకు గురికావడంతో ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. ఛాతీ నొప్పి, హిమోగ్లోబిన్ లోపంతో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన లాలూను ఇవాళ సాయంత్రం పాట్నా తీసుకెళ్లనున్నట్టు సమాచారం. దాణా కుంభకోణం కేసుల్లో బిస్రా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ కొన్ని వారాల క్రితం బెయిల్‌పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. వైద్య అవసరాల కింద ఈ నెల 17 వరకు రాంచీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
నాసా '2020 అంగారక మిషన్‌'కు పేరు పెట్టొచ్చు

నాసా '2020 అంగారక మిషన్‌'కు పేరు పెట్టొచ్చు

అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' 2020లో అంగారకగ్రహ మిషన్‌ చేపట్టనుంది. ఈ మిషన్ కు పేరుపెట్టాలని బాలలను ఆహ్వనించింది. దీనితో పాటు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యానికి ఏదైనా సంస్థ ముందుకురావాలని పిలుపునిచ్చింది. భాగస్వామ్యానికి ముందుకు రావాలనుకునే కార్పొరేట్, స్వచ్ఛంద, విద్యాసంస్థలు అక్టోబర్ 9 లోగా ప్రతిపాదనలు పంపాలని తెలిపింది. మార్స్ 2020 మిషన్‌లో అరుణగ్రహంపై జీవం మనుగడ సాగించే అవకాశాలను పరిశోధించనున్నారు. 2019 విద్యా సంవత్సరంలో ఈ పేరు పెట్టే పోటీని నిర్వహించాలని నాసా భావిస్తోంది.  
మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పకనే చెప్పిన ప్రధాని మోడీ

మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పకనే చెప్పిన ప్రధాని మోడీ

2019లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న ఒడిషా ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. ఒడిషాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రధాని మోడీ. బొగ్గు గ్యాస్ ఆధారిత ఫర్టిలైజర్ ప్లాంట్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఫర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం 2000లో తీసుకోవడం జరిగిందని ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు.

దేవదాస్ మూవీ ఆ చిత్రానికి రీమేకా!

దేవదాస్ మూవీ ఆ చిత్రానికి రీమేకా!

శ్రీరామ్ ఆదిత్య దర్శత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జున, నాని కలసి నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నాగార్జున దేవాగా డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. నాని దాస్ పాత్రలో డాక్టర్ గా కనిపించబోతున్నాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం దేవదాస్ చిత్రం హాలీవుడ్ మూవీ 'అనలైజ్ దిస్' కు రీమేక్ అని నెటిజన్లు అంటున్నారు. అనలైజ్ దిస్ చిత్రం 1999 లో వచ్చింది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more