Short News

వృద్ధి రేటు పెరగాలంటే అన్ని బ్యాంకులు విలీనం కావాల్సిందే

వృద్ధి రేటు పెరగాలంటే అన్ని బ్యాంకులు విలీనం కావాల్సిందే

బ్యాంకింగ్ రంగం సామర్థ్యత తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు ఇండియన్ బ్యాంకింగ్ కాన్‌క్లేవ్‌‌లో పాల్గొన్న నిపుణులు. వృద్ధి రేటు పెరగాలంటే బ్యాంకింగ్ సామర్థ్యం సరిగ్గా ఉంటేనే అది సాధ్యపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. పలు వేదికలపై జరిగిన చర్చల్లో బ్యాంకింగ్ రంగాన్ని కార్యకలాపాలను మరింత పటిష్టం చేయడంతో పాటు, బలోపేతం చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.అవసరమైతే బ్యాంకులన్నిటినీ కలిపి మూడు బ్యాంకులుగా విలీనం చేయాలని... డజను బ్యాంకుల కంటే ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

గెలాక్సీ నోట్ 9తో క‌లిపి గెలాక్సీ వాచ్ కొంటే ధ‌ర భారీగా త‌గ్గింపు

గెలాక్సీ నోట్ 9తో క‌లిపి గెలాక్సీ వాచ్ కొంటే ధ‌ర భారీగా త‌గ్గింపు

గెలాక్సీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.67,900 గా ఉంది. అయితే ఈ ఫోన్‌ను కొన్నవారికి శాంసంగ్ ఓ ఆఫర్‌ను అందిస్తున్నది. ఈ ఫోన్‌ను కొన్న యూజర్లు రూ.9,999 ధరకే గెలాక్సీ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ వాచ్ అసలు ధర రూ.24,990 ఉండగా, నోట్ 9ను కొన్నవారికి ఆఫర్ కింద ఈ వాచ్‌ను రూ.9,999 ధరకే అందిస్తున్నారు. శాంసంగ్ అందిస్తున్న ఈ ఆఫర్ అక్టోబ‌ర్ 20వ తేదీ వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ను శాంసంగ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఫోన్‌ను కొన్న వారికే అందిస్తుండగా, త్వరలో ఆన్‌లైన్ యూజర్లకు కూడా ఈ ఆఫర్‌ను అందివ్వనున్నారు.   
హిందీ రీ ట్వీట్ల‌లో ప్ర‌ధానిని అధిగ‌మించిన రాహుల్ గాంధీ

హిందీ రీ ట్వీట్ల‌లో ప్ర‌ధానిని అధిగ‌మించిన రాహుల్ గాంధీ

ట్విటర్‌లో ప్రధాని మోదీతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రీ ట్వీట్ల విషయంలో మొదటిసారి ఆయన్ని అధిగమించారు. గత జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు వీరిద్ద‌రికి వచ్చిన రీ ట్వీట్లపై మిచిగాన్‌ యూనివర్శిటీ అధ్యయనం జరపగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ట్విట్టర్‌లో ప్ర‌ధానికి 4.40 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ కేవలం 76 లక్షల ఫాలోవర్లు కలిగిన రాహుల్‌ గాంధీకి రీ ట్వీట్లు ఎక్కువ రావడం విశేషమని అధ్య‌య‌న క‌ర్తలు వ్యాఖ్యానించారు. కేవలం హిందీలో చేసిన ట్వీట్లపైనే వారు ఈ అధ్యయనం జరిపారు.   
బాబు, లోకేష్‌లపై కుట్రలు మానుకోండి: టీడీపీ నిప్పులు

బాబు, లోకేష్‌లపై కుట్రలు మానుకోండి: టీడీపీ నిప్పులు

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో మాట్లాడే దమ్ములేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం దేవినేని ఉమ మాట్లాడుతూ.. జగన్ చేష్టలు భరించలేకే ఆ పార్టీలోని 23మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోచేరారని అన్నారు. జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదు కాశీ యాత్ర అని ఎద్దేవా చేశారు. జగన్ తన పాదయాత్రలో ఏ సమస్యా ప్రస్తావించడం లేదని, ఆయన ప్రసంగమంతా చంద్రబాబును తిట్టడం కోసమేనని దేవినేని విమర్శించారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more