Short News

ముజ‌ఫ‌ర్‌పూర్ కేసు నిందితుడి కాల్ లిస్టులో ప్ర‌ముఖుల నంబ‌ర్లు

ముజ‌ఫ‌ర్‌పూర్ కేసు నిందితుడి కాల్ లిస్టులో ప్ర‌ముఖుల నంబ‌ర్లు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడైన బ్రజేష్‌ ఠాకూర్‌ కాల్‌లిస్ట్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఇందులో దాదాపు 40 మంది ప్రముఖుల నంబర్లతో పాటు ఓ మంత్రి నంబరు ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీనిపై విచారణ ప్రారంభించామని తెలిపారు. ఒక బాలికను హతమార్చి, మృతదేహాన్ని పూడ్చిపెట్టారని భావిస్తున్న పెరటి ప్రదేశాన్ని ఫోరెన్సిక్‌ నిపుణుల పర్యవేక్షణలో పరిశీలించారు. భారీస్థాయి యంత్రాలను రప్పించడాన్ని చూస్తే మరింత లోతైన తవ్వకాలు జరపవచ్చని తెలుస్తోంది.   
స్వాతంత్ర్య దినోత్సవం: ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రసంగం

స్వాతంత్ర్య దినోత్సవం: ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రసంగం

దేశమంతా 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. మోడీ ఆయుష్మాన్ భారత్ - జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం ప్రారంభించే అవకాశముంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొంటున్నారు. ఇందుకోసం సిక్కోలు అంతా సిద్ధమైంది. వేడుకలు నిర్వహించే ప్రాంతంలో, శ్రీకాకుళం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హైదరాబాదులోని గోల్కొండ కోట ముస్తాబు అయింది.

ఈస్ట్ ఇండియా, బ్రిటిష్ రూల్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు

ఈస్ట్ ఇండియా, బ్రిటిష్ రూల్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు

72వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల కోసం భారతదేశం ముస్తాబు అయింది. సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్ర్యం లభించింది. సిపాయిల తిరుగుబాటు మొదలు ఎందరో పోరాటం కారణంగా భారతమాత స్వేచ్ఛా గాలి పీల్చుకుంది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, లాలా లజపతి రాజ్ వంటి ఎందరో పోరాటం చేశారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు. భారతదేశంలో బ్రిటిషర్లు దాదాపు 335 సంవత్సరాలు ఆధిపత్యం చలాయించారు లేదా పాలించారు.

షూటింగ్ లో గాయపడిన అమలాపాల్

షూటింగ్ లో గాయపడిన అమలాపాల్

మలయాళ భామ అమలాపాల్ యాక్షన్ సీక్వెన్స్ లో గాయపడింది. అధో అంధ పరవై పోలా చిత్ర షూటింగ్ లో ఓ స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో గాయమైంది. చేయి మడతపడడం వలన లిగ్మెంట్ టేర్ తో  అమలాపాల్ బాధపడింది. చేతితో  సంబంధం లేకుండా  ఉండే కొన్ని సన్నివేశాలని అమలాపాల్ పూర్తి చేసిందని చెబుతున్నారు.  ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకుంటున్న అమలా కొన్నాళ్ళు షూటింగ్ కి దూరంగా ఉండనుంది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more