Short News

ఆరెస్సెస్‌ను తీవ్ర‌వాద సంస్థ‌తో పోల్చిన రాహుల్‌

ఆరెస్సెస్‌ను తీవ్ర‌వాద సంస్థ‌తో పోల్చిన రాహుల్‌

‘భిన్నత్వంలో ఏకత్వమే కాంగ్రెస్‌ సిద్ధాంతం. ప్రజలను విభజించి, విషం చిమ్మడమే బీజేపీ, ఆరెస్సెస్‌ విధానం' అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆయన గురు, శుక్రవారాల్లోజర్మనీ రాజధాని బెర్లిన్‌, బ్రిటన్‌ రాజధాని లండన్‌లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆరెస్సెస్‌ను అరబ్‌ దేశాలలోని సున్నీ ఇస్లామిక్ తీవ్ర‌వాద సంస్థ‌ ‘ముస్లిం బ్రదర్‌హుడ్‌'తో పోల్చారు. దేశంలోని అన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖల్లోకి ఆరెస్సెస్‌ మనుషులను చొప్పించారని రాహుల్ ఆరోపించారు.   
ప్రియుడికి 65.. ప్రియురాలికి 38 ఏళ్లు.. బిగ్‌బాస్‌లో హాట్‌హాట్‌గా రొమాన్స్.. ఏదోరోజు సల్మాన్ కూడా..

ప్రియుడికి 65.. ప్రియురాలికి 38 ఏళ్లు.. బిగ్‌బాస్‌లో హాట్‌హాట్‌గా రొమాన్స్.. ఏదోరోజు సల్మాన్ కూడా..

ప్రేమకైనా, పెళ్లికైనా ఈడు జోడు ఉండాలంటారు. కానీ ప్రముఖ గాయకుడు, భజన్ కింగ్ అనూప్ జలోటా మాత్రం అది తప్పని నిరూపిస్తున్నాడు. 65 ఏళ్ల జలోటా 28 ఏళ్ల జస్రీన్ మాతరుతో డేటింగ్ చేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా వీరిద్దరూ బిగ్‌బాస్ హిందీ 12 షోలో జంట ప్రేమికులుగా పాల్గొనడం మరింత సెన్సేషనల్‌గా మారింది.బిగ్‌బాస్‌ 12లో అనూప్ జలోటా, జస్రీన్‌ను ఓ వింత జంటగా చూస్తున్నారు. వీరిద్దరి చేరికతో బిగ్‌బాస్ హాట్‌హాట్‌గా మారింది. భక్తీ గీతాలు పాడే ఈ గాయకుడు ఇప్పుడు రక్తితో కార్యక్రమాన్ని హడలెత్తించబొతున్నాడు.

ఆసియాకప్: చెలరేగిన భారత బౌలర్లు.. 162కే పాకిస్తాన్ ఆలౌట్

ఆసియాకప్: చెలరేగిన భారత బౌలర్లు.. 162కే పాకిస్తాన్ ఆలౌట్

ఆసియాకప్ తొలి వన్డేలో హాంగ్‌కాంగ్‌పై తడబడిన బౌలర్లు.. ఇవాళ పాకిస్థాన్‌పై మాత్రం ప్రభావం చూపించారు. ఇండియన్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కేవలం 43.1 ఓవర్లలో కేవలం 162 రన్స్ మాత్రమే చేసింది. భారత బౌలర్లు భువనేశ్వర్, కేదార్ జాదవ్‌లు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. భారీ స్కోర్ సాధిస్తుందని ఆశించిన పాక్.. తక్కువ స్కోర్‌కే చేతులెత్తేసింది. పాక్ టీమ్‌లో అత్యధికంగా బాబర్ 47, మాలిక్ 43 రన్స్ చేశారు. ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా గాయపడ్డా.. అతని స్థానంలో వచ్చిన మనీష్ పాండే ఓ సూపర్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.
‘లవ్‌ సోనియా’లో రిచా చద్దా నటకు రూ.8లక్షలు విరాళం

‘లవ్‌ సోనియా’లో రిచా చద్దా నటకు రూ.8లక్షలు విరాళం

‘లవ్‌ సోనియా' సినిమాలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటన అందరి మన్ననలు పొందటంతో పాటు, విమర్శకులు ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో మహిళలను అక్రమంగా తరలించి, వారితో వ్యాపారం చేస్తోన్న తీరును వివరించిన విధానం అందరి హృదయాలను తాకింది. విమర్శకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ సినిమా ముంబయికి చెందిన ఓ కంపెనీని ఆకట్టుకుంది. అక్రమంగా తరలిపోతున్న ఆడవారికి బాసటగా నిలవడానికి తమవంతుగా రూ.8లక్షలు విరాళంగా ఇచ్చింది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more