Short News

ఓడిపోతున్నాం: 2004 ఫలితాలను ముందే ఊహించిన వాజపేయి

ఓడిపోతున్నాం: 2004 ఫలితాలను ముందే ఊహించిన వాజపేయి

2004లో వాజపేయి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకోలేదని ఆయనకు సహాయకుడిగా పని చేసిన శివకుమార్ పారీఖ్ అన్నారు. ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తోందన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 2004లో భారత్ వెలిగిపోతోంది అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లలేదని, ముందస్తుకు వెళ్లడం 2004లో ఓటమికి ముఖ్య కారణమని ఆయన చెప్పారని తెలిపారు. ముందస్తుకు వెళ్లడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని, ఒత్తిడి కారణంగానే ఆయన వెళ్లారని చెప్పారు. లక్నోలో ప్రచారం ముగించుకున్న తర్వాత వచ్చిన వాజపేయి.. మనం ఓడిపోతున్నామని, ప్రభుత్వం పడిపోతుందని చెప్పారని గుర్తు చేసుకున్నారు.

పెటాకులవుతున్న పెళ్ళిళ్ళు ..విడిపోవటానికే ఇష్టపడుతున్నారు

పెటాకులవుతున్న పెళ్ళిళ్ళు ..విడిపోవటానికే ఇష్టపడుతున్నారు

ఇటీవలి కాలంలో వివాహ బంధం దంపతుల మధ్య ముళ్ళ బంధంగా మారుతోంది. అనుమానాలు, వివాహేతర సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు,  అదనపు కట్నాల వేధింపులు భార్య భర్తల మధ్య విభేధాలకు కారణమవుతున్నాయి. ప్రతీ చిన్న విషయానికి ఘర్షణలు పడుతూ దూరమవుతున్నారు. ఇటీవల పోలీసుస్టేషన్లలో భార్యాభర్తల మధ్య ఫిర్యాదులు పెరుగుతూ వస్తున్నాయి. విబేధాలతో ఒకరిపై ఒకరు పెట్టుకుంటున్న కేసులే ఎక్కువయ్యాయి. ఒకరికొకరు పంతాలకు పోవడంతో అర్ధాంతరంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ క్రమంలో చివరికి ఎవరో ఒకరు అన్యాయం కాక తప్పడం లేదు.
మైజియో యాప్‌లో కొత్త ఐఫోన్ల ప్రీ ఆర్డర్

మైజియో యాప్‌లో కొత్త ఐఫోన్ల ప్రీ ఆర్డర్

టెక్‌ దిగ్గజం ఆపిల్ ఇటీవల ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌లను విడుదల చేసింది. నిన్నటి నుంచి వీటి ప్రీ-ఆర్డర్‌లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ఐఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. www.jio.com, రిలయన్స్‌ డిజిటల్‌, మైజియో స్టోర్లు, మైజియో యాప్‌లలో ప్రీ-ఆర్డర్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సెప్టెంబర్‌ 28 నుంచి ఈ రెండు డివైజ్‌లు స్టోర్లలో అందుబాటులోకి వస్తున్నాయి. ఐఫోన్‌ 10ఎస్‌ 5.8 అంగుళాలు, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ 6.5 అంగుళాల సూపర్‌ రెటినా డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి.
భారత పౌరుడిగా నేను ఎప్పుడైనా ప్రధానిని కలవొచ్చు

భారత పౌరుడిగా నేను ఎప్పుడైనా ప్రధానిని కలవొచ్చు

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ భేటీ కావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మోహన్‌లాల్‌ భాజపాలో చేరబోతున్నారని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనను తిరువనంతపురం నుంచి బరిలోకి దింపాలని ఆరెస్సెస్‌ గట్టిగా పట్టుబడుతోందని అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ మోహన్‌లాల్‌ ప్రధానితో భేటీపై ఫేస్‌బుక్‌ వేదికగా వివరణ ఇచ్చారు. 'భారత పౌరుడిగా నేను ఎప్పుడైనా ప్రధానిని కలవొచ్చు. ఈ భేటిలో ప్రధాని మోదీ నాతో ఒక్క పదం కూడా రాజకీయం గురించి మాట్లాడలేదు' అని స్పష్టం చేసారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more