Short News

క్రైస్తవులపై  ఉక్కు పాదం మోపుతున్న చైనా ప్రభుత్వం

క్రైస్తవులపై ఉక్కు పాదం మోపుతున్న చైనా ప్రభుత్వం

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్నారు.  విదేశీ మతాల పట్ల ఉక్కుపాదం మోపుతున్నారు. దేశాన్ని చైనీయం చేయాలన్న లక్ష్యంతో వీఘర్ ముస్లింలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోందన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా క్రైస్తవులపై విరుచుకుపడుతూ చర్చిలపై దాడులు చేస్తున్నారు. కొద్ది నెలల్లోనే చర్చ్‌లను మూసివేయించటంతో పాటు  క్రైస్తవుల ఈ-కామర్స్ సైట్లను మూసివేయించారు. క్రైస్తవాన్ని ఆచరించేవారితో పాటు చర్చిలను ప్రభుత్వం వద్ద నమోదు చేయించాలని ఆదేశిస్తున్నారు.
'అదిగో'.. దసరాకు వచ్చేస్తోంది.!

'అదిగో'.. దసరాకు వచ్చేస్తోంది.!

దర్శకుడు రవిబాబు పందిపిల్ల ప్రధాన పాత్రలో 'అదిగో' అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అభిషేక్, నాభలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు సమర్పిస్తున్నారు. 
కేరళ వరదలు: రూ.12వేల కోట్ల పేటీఎం అధినేత విరాళం రూ.10వేలు

కేరళ వరదలు: రూ.12వేల కోట్ల పేటీఎం అధినేత విరాళం రూ.10వేలు

భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ అతలాకుతలమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందించింది. పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు రూ.20వేలకోట్ల నష్టం సంభవించింది. కేరళ వరదలపై దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. సామాన్యులు తమవంతు వస్తు, దుస్తులు, ఆహారం, ఇతర రూపాల్లో సాయం అందిస్తున్నారు. అయితే ప్రముఖ పేటీఎం అధినేత విజయ్ శేఖర శర్మ చేసిన సాయం నెటిజన్ల విమర్శలకు తావిచ్చింది. ఆయన సంపద రూ.12వేల కోట్లు. కానీ ఆయన ఇచ్చిన విరాళం రూ.10వేలు. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్రెండింగ్: కలర్స్ స్వాతి పెళ్లి, వాడో బ్రోకర్, ప్లాపుతో చరణ్ డీలా, శ్రీరెడ్డికి షాక్, చితక్కొట్టాలన

ట్రెండింగ్: కలర్స్ స్వాతి పెళ్లి, వాడో బ్రోకర్, ప్లాపుతో చరణ్ డీలా, శ్రీరెడ్డికి షాక్, చితక్కొట్టాలన

వాళ్లు బ్రోకర్ పని చేసి కోట్లు సంపాదించారు ప్రభాస్, తారక్ జెన్యూన్ అని చెప్పిన జగపతి బాబు, సినిమాలు ప్లాపులతో రోజుల తరబడి బెడ్రూంలో ఉండిపోయిన రామ్ చరణ్, బిగ్‌బాస్ పిచ్చోళ్ల స్వర్గమా? బయటకొచ్చి బాబు గోగినేని సంచలనం, సినిమా ప్లాప్ అయింది అప్పులై పాలైన హీరో....దొంగతనాలు, చివరకు కటకటాల్లోకి, హీరోతో డేటింగ్‌లో ఉన్నాను.. ఒక్కొక్కొడిని చితక్కొట్టాలని ఉంది, రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌పై రష్మిక మందన్న రియాక్షన్, కలర్స్ స్వాతి పెళ్లి.....

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more