Short News

దుబాయ్‌లో బ్రిటిష్ టూరిస్ట్ అతివేగం, రూ.31 లక్షల జరిమానా

దుబాయ్‌లో బ్రిటిష్ టూరిస్ట్ అతివేగం, రూ.31 లక్షల జరిమానా

బ్రిటిష్ టూరిస్ట్ ఒకరు దుబాయ్‌లో తన కారును అత్యంత వేగంగా నడపడంతో స్థానిక పోలీసులు అతనికి రూ.30 లక్షలకు పైగా జరిమానా విధించారు. దుబాయ్ అంటే మనకు ఆకాశహర్మ్యాలు, ఎత్తైన భవనాలు, అందమైన రోడ్లు కనిపిస్తాయి. ఈ రోడ్లపై నిబంధనలకు మించి వేగంగా దూసుకెళ్లిన విదేశీయుడికి భారీ జరిమానా పడింది. ఇటీవల 25 ఏళ్ల బ్రిటిష్ యువకుడు దుబాయ్‌లో లంబోర్గిణి హరికేన్ కారును రెండు రోజులకు గాను రూ.1 లక్ష చెల్లించి అద్దెకు తీసుకున్నాడు. అథని పాస్ పోర్టును అద్దెకు ఇచ్చే ఏజెన్సీ దగ్గర పెట్టుకుంది. దుబాయ్ రోడ్లపై చక్కర్లు కొట్టాడు.

ఆ కారు న‌డ‌పాలంటే పైన కూర్చోవాలి!

ఆ కారు న‌డ‌పాలంటే పైన కూర్చోవాలి!

ప్రతీ రోజూ కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా కారు నడపడంపై చేసిన ఒక ప్రయోగం విజయవంతమై వినోదాన్ని అందిస్తోంది. ఈ కారును నడపాలంటే కారు లోపల కాకుండా కారుపైన ప్రత్యేకంగా అమర్చిన సీటులో కూర్చోవాలి. దీనిని నడుపుతుంటే కారును బైక్ మాదిరిగా నడుపుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ‘మాస్టర్ మిలో' అనే వ్యక్తి ఈ ఆవిష్కరణ చేసి, దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశారు. కాగా మాస్టర్ మిలో తనకు వచ్చే రకరకాల ఐడియాలను అమలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ కారును రూపొందించారు.   
కాంగ్రెస్ పార్టీతో నా పెళ్లి అయిపోయింది!

కాంగ్రెస్ పార్టీతో నా పెళ్లి అయిపోయింది!

కాంగ్రెస్‌ పార్టీతో తన వివాహం జరిగిపోయిందని ఆ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అన్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన మీడియా ఎడిటర్ల సమావేశంలో స్పందిస్తూ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఊహల్లో బతుకుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ పర్యటనలో రాహుల్‌ రెండో రోజైన మంగ‌ళ‌వారం బిజీబిజీగా గడిపారు. ఓ హోటల్‌లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. సమావేశంలో నేతలను ఉద్దేశించి ఫిర్యాదులు చేయవద్దని, సలహాలు..సూచనలు మాత్రమే ఇవ్వాలని కోరారు. సీఎల్పీ నేత జానారెడ్డి పేరు జాబితాలో లేదంటూ ఎస్పీజీ ఆయ‌న‌ను ఆపేయడంతో అలక బూనారు.   
డెలివరీ ఎప్పుడో తెలియదు, జియోఫోన్ 2 బుకింగ్స్ రేపటి నుంచే,బుకింగ్ ఎలా?

డెలివరీ ఎప్పుడో తెలియదు, జియోఫోన్ 2 బుకింగ్స్ రేపటి నుంచే,బుకింగ్ ఎలా?

దేశీయ మొబైల్ మార్కెట్లోకి సునామిలాగా దూసుకొచ్చిన జియో అత్యంత తక్కువ ధరకే జియోఫోన్ ను తీసుకొచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ విజయవంతమైన నేపథ్యంలో జియోఫోన్ 2 పేరుతో మరో సరికొత్త ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ ఫోన్ బుకింగ్స్ రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జూలైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ జియో ఫోన్ 2పై ప్రకటన చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే రేపటి నుంచి జియో ఫోన్ 2 కు గాను బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. మరి బుకింగ్ ప్రాసెస్ ఎలా అంటే..

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more