Short News

అమెరికా కాంగ్రెస్‌లో అడుగుపెట్టనున్న తొలి ముస్లిం మహిళ

అమెరికా కాంగ్రెస్‌లో అడుగుపెట్టనున్న తొలి ముస్లిం మహిళ

అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా రషీదా తలైబ్‌ (42) చరిత్ర సృష్టించనున్నారు. మిషిగన్‌లోని 13వ కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌లో డెమోక్రటిక్‌ పార్టీ నామినేషన్‌ను ఆమె గెలుచుకున్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థులెవరూ బరిలోకి దిగకపోవటంతో నవంబరులో జరుగనున్న ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఆమె విజయం సాధించనున్నారు. పాలస్తీనా సంతతికి చెందిన రషీద్‌ బ్రెండా జోన్స్‌పై పోటీచేసి డెమోక్రటిక్‌ నామినేషన్‌ను గెలుచుకున్నారు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా పనిచేసిన రషీద్ 2009 నుంచి 2014లో మిషిగన్‌ రాష్ట్ర శాసనకర్తగా పనిచేసారు.
సినిమా ప్లాప్ అయింది: అప్పులై పాలైన హీరో....దొంగతనాలు, చివరకు కటకటాల్లోకి!

సినిమా ప్లాప్ అయింది: అప్పులై పాలైన హీరో....దొంగతనాలు, చివరకు కటకటాల్లోకి!

సినిమాల మీద పిచ్చితో అప్పులు చేసిన మరీ సినిమా తీశాడు. కానీ అది కాస్త నష్టాలు మిగల్చడంతో అప్పుల నుండి బయటపడటానికి దొంగతనాలను ఎంచుకున్నాడు. హబ్సిగూడ ప్రాంతంలో దొంగతనాలు చేయడానికి రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 'నివురు' అనే సినిమాలో హీరోగా నటించడం, ఆ సినిమా కారణంగానే దొంగతనాల వైపు మళ్లడం చర్చనీయాంశం అయింది.

రానున్న మూడు రోజులు హైద‌రాబాదులో ట్రాఫిక్ ఆంక్ష‌లు

రానున్న మూడు రోజులు హైద‌రాబాదులో ట్రాఫిక్ ఆంక్ష‌లు

ఉప రాష్ట్రపతి హైద‌రాబాదులో ఈ నెల 16, 17, 18వ తేదీలలో పర్యటించనున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. 16వ తేదీ సాయంత్రం 4.15 నుంచి 5.05 వరకు బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలిలోని ఓం కన్వెన్షన్ వరకు; మ‌ళ్లీ 5.45 నుంచి 6.35 వరకు గచ్చిబౌలి నుంచి బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వరకు. 17వ తేదీ ఉదయం 9.15 నుంచి 10.05 వరకు బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ హెచ్‌ఐసీసీ వరకు. ఉదయం 10.45 నుంచి 11.35 వరకు హెచ్‌ఐసీసీ నుంచి బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వరకు, సాయంత్రం 7.05 నుంచి 8 వరకు బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి ఓం కన్వెన్షన్ వరకు ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయి.        
తాలిబ‌న్ల న‌ర‌మేధం.. 17 మంది సైనికుల హ‌తం

తాలిబ‌న్ల న‌ర‌మేధం.. 17 మంది సైనికుల హ‌తం

అఫ్గ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌కు కూతవేటు దూరంలో ఉన్న తూర్పు ఘజని నుంచి తాలిబన్లను తరిమికొట్టాలని ప్రయత్నిస్తున్న అఫ్గాన్‌ భద్రతాదళాలకు మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పర్యబ్‌ ప్రావిన్స్‌లోని ఘోర్‌మాచ్‌ జిల్లాలో ఉన్న కీలక సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. అక్కడ కాపలా ఉన్న సైనికుల్లో 17 మంది పొట్టనపెట్టుకున్నారు. 40 మందిని బందీలుగా పట్టుకున్నారు. మరో 40 మంది తాలిబన్ల ధాటికి తట్టుకోలేక సమీప కొండల్లోకి పారిపోయారు. ఈ నర మేధంలో ఇప్పటికే 110 నుంచి 150 మంది పౌరులు చనిపోయినట్లు ఐరాస తెలిపింది.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more