Short News

ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా స్కాట్ మారిసన్

ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా స్కాట్ మారిసన్

ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ శకం ముగిసింది. మాజీ ట్రెజరర్ స్కాట్ మారిసన్ ఆస్ట్రేలియాకు కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిబరల్ పార్టీలో నాయకత్వం కోసం జరిగిన పోరాటంలో టర్న్‌బుల్ చేతులెత్తేసారు. పార్టీ నాయకత్వం కోసం జరిగిన తాజా ఎన్నికల్లో మారిస్ 45-40 ఓట్లతో నెగ్గారు. ప్రభుత్వ నిర్వహణలో టర్న్‌బుల్ విఫలమైనందు వల్ల పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పార్టీలోని ఎంపీలు ఓటింగ్‌కు పిలుపునివ్వడంతో టర్న్‌బుల్ తన నాయకత్వ హోదాను కోల్పోవాల్సి వచ్చింది. గత దశాబ్ధ కాలంలో మూడుసార్లు సిట్టింగ్ ప్రధానులే పదవులను కోల్పోయారు.
రాహుల్ విదూషకుడు...చెప్పిన అబద్ధమే మళ్లీ చెబుతున్నారు:జైట్లీ

రాహుల్ విదూషకుడు...చెప్పిన అబద్ధమే మళ్లీ చెబుతున్నారు:జైట్లీ

రాఫెల్ ఒప్పందం, పారిశ్రామికవేత్తలకు రూ.2లక్షల50వేల కోట్లు రుణాలు మాఫీ చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక విదూషకుడిలా పదేపదే అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ. రాఫెల్ ఒప్పందంపై అబద్ధాలు చెప్పారని... నాన్ పర్ఫామింగ్ అసెట్స్ పై అబద్దాలు చెప్పారని ఇలా... ప్రతీదీ అబద్దం చెప్పడం వల్ల ప్రజలకు మీరు అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోందని అన్నారు. ప్రజలకు చెప్పాల్సిన విషయాలు సత్యదూరంగా ఉండకూడదని చెప్పిన జైట్లీ... అది తమాషా చేయడం కాదని అన్నారు.

మాధవి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద వైద్యులు

మాధవి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద వైద్యులు

వేరే కులానికి చెందిన యువకుడ్ని ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణాలతో పోరాడుతున్న మాధవి హెల్త్‌ బులిటెన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. మాధవి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. మరో 48 గంటల తర్వాత జనరల్‌ వార్డుకు తరలిస్తామని తెలిపారు. తండ్రి ఇంత దారుణంగా దాడి చేయడంతో ఆమె తీవ్ర షాక్‌కు గురైందన్నారు. తన తల్లి.. తమ్ముడిని చూడాలని కోరిందని చెప్పారు.

కులాంతర వివాహాలు ఆరోగ్యానికి మంచివి..డీఎన్ఏ పరీక్షలో వెల్లడి

కులాంతర వివాహాలు ఆరోగ్యానికి మంచివి..డీఎన్ఏ పరీక్షలో వెల్లడి

ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త విషయాల్లో ఎక్కువ ఆసక్తిగా మారింది జన్యుశాస్త్రం. జన్యుశాస్త్రం గురించి ఏ కొత్త అంశం శాస్త్రవేత్తలు కనుగొన్నా చాలామంది ఆ విషయం తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఇతర దేశాల్లోనే కాదు భారత దేశంలో కూడా జన్యుశాస్త్రానికి ప్రాముఖ్యత ఏర్పడింది. "మనం ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం " ఇంగ్లీషులో "Who We Are and How We Got Here" అనే టైటిల్‌తో హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ రిచ్ ఓ పుస్తకం రాశారు. ఇందులో డీఎన్ఏ నుంచి మానవుని మూలాలను ఈ పుస్తకంలో ఆయన వివరించారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more