Short News

మీకు హార్మోన్ల అసమతుల్యత ఉన్నదని తెలిపే 8 శారీరక లక్షణాలు

మీకు హార్మోన్ల అసమతుల్యత ఉన్నదని తెలిపే 8 శారీరక లక్షణాలు

బాధాకరమైన విషయం ఏంటంటే, మనం ఏదన్నా అర్థం చేసుకునే సమయానికి పరిస్థితులు చెడ్డగా మారిపోతాయి. కానీ శరీరంలో సమస్యలు వచ్చే ముందు జరిగే కొన్ని మార్పులు,లక్షణాలు మన దృష్టిని దాటిపోవని మనం కాదనలేం.

నేను ఇటీవల మా గైనకాలజిస్టు వద్దకి సాధారణ చెకప్ కి వెళ్ళినప్పుడు ఫ్లూ,వైరల్ ఇన్ఫెక్షన్లు,సాధారణ ఆరోగ్య సమస్యలు ఎలా వెంటనే తెలుస్తాయి, కానీ హార్మోన్ల సమస్య,క్యాన్సర్ లాంటివి చాలా ఆలస్యమయ్యేదాకా ఎందుకు తెలుసుకోలేం అని అడిగాను.

సిక్స్ ప్యాక్స్‌లో క‌నిపించనున్న 'బ‌స్టాప్' హీరో

సిక్స్ ప్యాక్స్‌లో క‌నిపించనున్న 'బ‌స్టాప్' హీరో

‘బస్టాప్‌' చిత్రంతో ఆకట్టుకున్న ప్రిన్స్‌ హీరోగా త్వరలో ఓ సినిమా ప్రారంభంకానుంది. ‘సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌' చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఎ.సుశాంత్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శక నిర్మాత. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లబోతున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ‘ఓ వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రిన్స్‌ కథకు తగ్గట్టు తనను తాను మార్చుకున్నారు. దీనికోసం ఫస్ట్‌ టైమ్‌ సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. ఇందులో నలుగురు కథానాయికలు నటిస్తారు. ఓ ప్రత్యేక పాత్రలో స్టార్‌ హీరోయిన్‌ కనిపిస్తారు' అని తెలిపారు.   
రాహుల్ కుటుంబ పాలనపై నువ్వే మాట్లాడాలి: కేసీఆర్

రాహుల్ కుటుంబ పాలనపై నువ్వే మాట్లాడాలి: కేసీఆర్

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటనలో తమపై విమర్శలు గుప్పించారని కేసీఆర్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అని రాహుల్ చెప్పారని, కానీ తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వమే లేదన్నారు. తాము డబుల్ బెడ్రూంలు కట్టలేదని చెప్పారని, కానీ కడుతున్నామని చెప్పారు. రాహుల్ వస్తానంటే తీసుకెళ్లి చూపించడానికి సిద్ధమని, అప్పుడైనా జ్ఞానోదయం అవుతుందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్న రాహుల్ వ్యాఖ్యలపై కేసీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతం: పవన్

కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతం: పవన్

2014లో తాను జనసేన పార్టీ పెట్టిన సమయంలో కొంతమంది కాపు నేతలు మీకు అండగా ఉంటామని చెప్పారని, వారితో తాను అప్పుడే చెప్పానని, నేను కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని చెప్పానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం అన్నారు. కానీ తాను అన్ని కులాలను గౌరవిస్తామన్నారు. పవన్ కులాలను నమ్ముతున్నారని చంద్రబాబు విమర్శిస్తారని, అదే అయితే 2014లో మీకు ఎలా మద్దతిచ్చానని ప్రశ్నించారు. మీరు పెద్దలని, దశాబ్దాల అనుభవం ఉందన్నారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more