Short News

ప్ర‌మాదంలో ప‌డిన ఒంటెల మ‌నుగ‌డ‌

ప్ర‌మాదంలో ప‌డిన ఒంటెల మ‌నుగ‌డ‌

ఎడారి జీవికి ఎసరొచ్చింది. మాంసం కోసం వధించేందుకు ఒంటెలను తరలిస్తుండటంతో రాజస్ధాన్‌ రాష్ట్ర జంతువు మనుగడ ప్రమాదంలో పడింది. దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లో ఎనిమిది లక్షలుగా ఉన్న ఒంటెల సంఖ్య ప్రస్తుతం రెండు లక్షలకు పడిపోయింది. 2016లో ఒంటెను రాష్ట్ర జంతువుగా గుర్తించినా ఒంటెలు అంతరించే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల బార్మర్‌ నుంచి ఒంటెలను తరలిస్తున్న ట్రక్కు పట్టుబడటంతో ఒంటెల స్మగ్లింగ్‌ విశృంఖలమవుతుండటం వెలుగులోకి వచ్చింది. స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ను చేధించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.   
4000కు పైగా వెబ్ సైట్లను మూసేసిన చైనా

4000కు పైగా వెబ్ సైట్లను మూసేసిన చైనా

ఆన్‌లైన్‌లో ప్రమాదకర సమాచారాన్ని పంపిణీ చేస్తున్నాయంటూ నాలుగు వేలకు పైగా వెబ్ సైట్లను చైనా ప్రభుత్వం మూసేసింది. 'ఇంటర్నెట్‌పై చైనా కఠినమైన సెన్సార్ షిప్ అమలు చేస్తుంది. బూతు, జూదం, మతప్రచారం, వదంతులు వ్యాపింపజేసే సైట్లను ఏమాత్రం సహించదు. గత మే నెలలో అధికారులు 120 ఉల్లంఘనలను గుర్తించి అవకతవకలను సరిచేయాల్సిందిగా 230 కంపెనీలకు నోటీసులు పంపింది. ఆగస్టు చివరినాటికి 1,43,000 పేజీలను తొలగించారు. అసభ్య విలువల్ని, అశ్లీలతను, బూతును ప్రచారం చేసే ఆన్‌లైన్ కంటెంట్‌పై అధికారులు చర్యలు తీసుకుంటున్నారని జిన్‌హువా వార్తాసంస్థ వెల్లడించింది.
లేడి నిర్మాతకు బెదిరింపు కాల్స్.. వివాదంగా మారిన సాంగ్, తెలంగాణ ఎమ్మెల్యే రంగంలోకి!

లేడి నిర్మాతకు బెదిరింపు కాల్స్.. వివాదంగా మారిన సాంగ్, తెలంగాణ ఎమ్మెల్యే రంగంలోకి!


ఈ శుక్రవారం మూడు చిత్రాలు తెలుగు తెరపైకి వచ్చాయి. విక్రమ్ నటించిన సామి, సుధీర్ బాబు నన్ను దోచుకుందువటేతో పాటు చిన్న చిత్రం వచ్చిన ఈ మాయ పేరేమిటో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మాయ పేరేమిటో చిత్రం వివాదం చిక్కుకుంది. ఈ చిత్రంలోని ఓ పాట హిందువుల మనోభావాలకు వ్యతిరేంగా ఉందని వివాదం మొదలయింది. ఆ వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆపాటలో ఉన్న వివాదాస్పద లిరిక్స్ ని తొలగించాలని నెల రోజుల క్రితమే హెచ్చరించినట్లు రాజా సింగ్ తెలిపారు.

ప్రధానిగా మోడీ అనర్హుడు, రాజీనామా చెయ్యాలి, రాఫెల్ డీల్

ప్రధానిగా మోడీ అనర్హుడు, రాజీనామా చెయ్యాలి, రాఫెల్ డీల్


ప్రధాన మంత్రి పదవికి నరేంద్ర మోడీ అనర్హుడని, వెంటనే ఆయన రాజీనామా చెయ్యాలని లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి (కాంగ్రెస్) మల్లికార్జున ఖార్గే డిమాండ్ చేశారు. రాఫెల్ డీల్ లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సోవో హోలెన్ స్వయంగా చెప్పారని, ఇక ఇంతకంటే సాక్షం ఏం కావాలని మల్లికార్జున ఖార్గే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు. అనీల్ అంబానికి రాఫెల్ కాంట్రాక్టు ఇప్పించడంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలకపాత్ర పోషించారని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని మల్లికార్జున ఖార్గే అన్నారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more