Short News

ఇంట్లో తయారుచేసుకునే సహజమైన మందార తల నూనె

ఇంట్లో తయారుచేసుకునే సహజమైన మందార తల నూనె

ఈ కాలంలో జుట్టు సన్నబడిపోవటం చాలామంది స్త్రీలకి సాధారణంగా ఉండే సమస్య. విపరీత పరిస్థితులు, కాలుష్యం ఉన్న వాతావరణం వల్ల మన జుట్టు ఆరోగ్యం రోజురోజుకీ దెబ్బతింటుంది. నూనెలు రాస్తూ జుట్టును ఆరోగ్యకరంగా ఉంచటం తప్పనిసరి లేకపోతే ప్రతిరోజూ వాతావరణ ఒత్తిడి వల్ల జుట్టుకి నష్టం జరుగుతుంది.

జుట్టుకి రాసుకునే నూనెలు జుట్టుకు పోషణనిచ్చి, కండీషన్ చేసి అనేక జుట్టు సంబంధ సమస్యలని పరిష్కరిస్తాయి. క్రమం తప్పకుండా జుట్టుకి నూనె రాసుకోవటం వల్ల జుట్టు పెరుగుతుంది. కానీ మీ జుట్టుకి తగిన నూనెను ఎంచుకోవటం ముఖ్యం.

31న ‘కోకోకోకిల’గా వస్తున్న నయనతార

31న ‘కోకోకోకిల’గా వస్తున్న నయనతార

తమిళంలో నయనతార నటించిన 'కొలమావు కోకిల'ఈ నెల 17వ తేదీన విడుదలైంది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, 3 రోజుల్లోనే 10 కోట్లను వసూలు చేసింది. నయనతార కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమాకి కూడా చోటు దక్కింది. దాంతో తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'కోకోకోకిల' పేరుతో ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు.
బావ‌.. మా అక్క ర‌క్ష‌కుడివి నువ్వే

బావ‌.. మా అక్క ర‌క్ష‌కుడివి నువ్వే

ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌ల నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అక్క ఎంగేజ్‌మెంట్‌ కావడంతో సోదరి పరిణీతీ చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ అయ్యారు. మాకు మంచి పార్టనర్‌ దొరకాలని కోరుకున్నాం. ఈ రోజు నుంచి ఇక ఊహించుకోవాల్సిన పని లేదు. నిక్‌.. నీకంటే పర్ఫెక్ట్ మ‌నిషి ఎవరూ ఉండరనుకుంటున్నాను. నేను నీతో క‌లిసి తిరిగాను, తిన్నాను. ఇప్పుడు చెప్పగలను. నువ్వు అక్కకి స‌రి జోడ‌ని. తనని బాగా ప్రేమించు. ఎందుకంటే తను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తోంది. అక్క సున్నిత మనస్కురాలు. త‌న‌కెప్పుడూ ర‌క్ష‌ణ‌గా ఉండు.' అని ప‌రిణితీ అన్నారు.    
అందుకే అంత తేలిగ్గా అల‌సిపోను!

అందుకే అంత తేలిగ్గా అల‌సిపోను!

‘మనం ఒక పనిని ఇష్టపడి చేస్తున్నప్పుడు, అందులో అలసిపోవడం అనేది ఉండదు'' అని అంటున్నారు హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. తెలుగులో ‘యన్టీఆర్‌' బయోపిక్‌లో శ్రీదేవిగా నటిస్తున్నట్టు సమాచారం. రకుల్‌ ప్రీత్‌ మాట్లాడుతూ ‘నాకు నటించడమన్నా, వర్కవుట్‌ చేయడమన్నా చాలా ఇష్టం. అందుకే అంత తేలిగ్గా అలసిపోను. పైగా జీవితమంటే ఏంటి? అనే అంశంపై పలువురి ప్రసంగాలు వింటుంటాను. అవన్నీ నాపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. సహనానికి ఉన్న ప్రాధాన్యాన్ని చక్కగా గుర్తుచేస్తాయి. అందుకే ఏం చేసినా అర్థవంతంగా చేయాలనుకుంటాను' అని అన్నారు.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more