Short News

'రాఖీ ఛాలెంజ్' విసిరిన చిలుకూరు బాలాజీ ఆల‌య పూజారి

'రాఖీ ఛాలెంజ్' విసిరిన చిలుకూరు బాలాజీ ఆల‌య పూజారి

తెలంగాణ‌లోని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన పూజారి రంగరాజన్ రాఖీ ఛాలెంజ్ విసిరారు. ఈ స‌వాల్ ప్ర‌కారం ఆల‌యాన్ని సందర్శించే యువకులు ఏ యువతి రాఖీ కట్టినా ఆమెను సోదరిగా స్వీకరించాలి. ఆమె రక్షణ తన బాధ్యతగా భావించాలి. అలాగే యువతులు రాఖీ కట్టిన యువకుడిని అన్నలా భావించి అతడి ఆయురారోగ్యాల గురించి ప్రార్థించాలి. ఇలాంటి స‌వాళ్ల వల్ల సమాజంలో అన్నాచెల్లెళ్ల బంధం బలపడుతుందని రంగరాజన్‌ తెలిపారు. మహిళలపై దాడుల నివారణను కాంక్షిస్తూ విద్యార్థినులతో కలిపి రక్షాసూత్ర కార్యక్రమాన్ని, ఆగస్టు 29న కన్యా వందనాన్ని నిర్వహిస్తున్నామ‌న్నారు.
అమెరికా వద్దు ..ఆస్ట్రేలియా, కెనడా 'బెటర్'

అమెరికా వద్దు ..ఆస్ట్రేలియా, కెనడా 'బెటర్'

రూపాయి పతనంతో అమెరికాలో భారతీయ విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. ఆరు నెలల క్రితం డాలర్‌ విలువ రూ.65 స్థాయి నుంచి ఈ నెలలో ఏకంగా రూ.72.54కు పడిపోవడంతో అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల అంచనాలకు, ఖర్చులకు మధ్య అగాధం ఏర్పడుతోంది. అక్కడి విశ్వవిద్యాలయాలకు చెల్లించాల్సిన ఫీజుల భారీగా పెరగడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. రూపాయి విలువ పతనంతో ప్రతి సెమిస్టర్‌కు కట్టాల్సిన ఫీజు సగటున రూ.10,000 నుంచి రూ.12000కు పెరిగిపోయింది. దీంతో అమెరికాను కాదని ఆస్ట్రేలియా, కెనడాల వైపు దృష్టి సారిస్తున్నారు. 
13ఏళ్ళకే 'ప్రేమ' అంటున్నారు ..కాదంటే పారిపోతున్నారు

13ఏళ్ళకే 'ప్రేమ' అంటున్నారు ..కాదంటే పారిపోతున్నారు

భాగ్యనగరంలో పదమూడు, పదిహేనేళ్ళ ప్రాయంలోనే తెలిసీ తెలియని ఆకర్షణతో ప్రేమలో పడిపోతున్నారు. ఇటీవలి కాలంలో కౌమారదశలో ఉన్న బాలబాలికలు గడప దాటుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. గ్రేటర్‌ పరిధిలో నమోదవుతున్న కేసుల్లో 25 శాతం అదృశ్యం ఘటనలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఎనిమిది, తొమ్మిది తరగతుల పిల్లలపై సామాజిక మాధ్యమాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాల సదుపాయం అందుబాటులో ఉండటంతో అశ్లీల దృశ్యాల వీక్షణకు లోనవుతూ హద్దులు దాటేందుకు వెనుకాడటం లేదు. ఏమాత్రం గట్టిగా మందలించినా గడప దాటేందుకు సిద్ధమవుతున్నారు.
తాట తీస్తా ఎదవ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాటింగ్ లీక్ చేసిన శ్రీరెడ్డి!

తాట తీస్తా ఎదవ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాటింగ్ లీక్ చేసిన శ్రీరెడ్డి!

టాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలతో శ్రీరెడ్డి సెలేబ్రిటిగా మారిపోయింది. ఆమె ఆరోపణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమిళ, తెలుగు సినీ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజగా శ్రీరెడ్డి టాలీవుడ్ నిర్మాత రాంకీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడితో జరిగిన చాటింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.రాంకీ మొదటి నుంచి శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పలు టివి డిబేట్లలో రాంకీ పాల్గొన్న సంగతి తెలిసిందే.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more