Short News

వీధి దీపాల కింద ట్యూష‌న్.. సెక్యూరిటీ గార్డుకు హ్యాట్సాఫ్‌

వీధి దీపాల కింద ట్యూష‌న్.. సెక్యూరిటీ గార్డుకు హ్యాట్సాఫ్‌

సేవా దృక్పథం ఉండాలేగానీ ఏ చిన్న అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకోవచ్చు. అలాంటి ఓ పెద్దాయనపై క్రికెట్ దిగ్గజం లక్ష్మణ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘నిజమైన ఈ హీరో పేరు బ్రిజేంద్ర. డెహ్రాడూన్‌లో ఓ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడు. ఆర్మీ నుంచి రిటైర్ అయినప్పటికీ దేశం కోసం సేవ చేయాలన్న తపన ఇంకా ఆయనలో ఉంది. సాయంత్రం సమయాల్లో ఏటీఎం దగ్గర వెలిగే వీధి దీపాల‌ కింద స్థానిక మురికివాడల్లోని చిన్నారులకు ఆయన ట్యూషన్ చెబుతున్నారు. విశిష్టమైన వ్యక్తికి వందనం' అంటూ లక్ష్మణ్ కొనియాడాడు.   
'కీర్తీ సురేశ్‌'కు కథ బాగుంటే చాలు

'కీర్తీ సురేశ్‌'కు కథ బాగుంటే చాలు

నటి కీర్తీ సురేశ్‌ కు కథ బాగుంటే చాలు హీరో ఎవరన్నది ఆమెకు ముఖ్యం కాదు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఆమె కథ నచ్చి శశికుమార్‌ సరసన నటించడానికి అంగీకరించింది. ఎస్‌.ఆర్‌. ప్రభాకరన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం కీర్తీసురేశ్‌ విక్రమ్‌ సరసన నటించిన 'సామీ స్క్యేర్‌' ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. విశాల్ తో నటించిన 'పందెంకోడి 2' చిత్రం దసరాకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. శశికుమార్, ప్రభాకరన్‌ కాంబినేషన్‌లో ‘సుందరపాండియన్‌' అనే సినిమా వచ్చింది.  
ప్రియుడికి 65.. ప్రియురాలికి 38 ఏళ్లు.. బిగ్‌బాస్‌లో హాట్‌హాట్‌గా రొమాన్స్.. ఏదోరోజు సల్మాన్ కూడా..

ప్రియుడికి 65.. ప్రియురాలికి 38 ఏళ్లు.. బిగ్‌బాస్‌లో హాట్‌హాట్‌గా రొమాన్స్.. ఏదోరోజు సల్మాన్ కూడా..

ప్రేమకైనా, పెళ్లికైనా ఈడు జోడు ఉండాలంటారు. కానీ ప్రముఖ గాయకుడు, భజన్ కింగ్ అనూప్ జలోటా మాత్రం అది తప్పని నిరూపిస్తున్నాడు. 65 ఏళ్ల జలోటా 28 ఏళ్ల జస్రీన్ మాతరుతో డేటింగ్ చేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా వీరిద్దరూ బిగ్‌బాస్ హిందీ 12 షోలో జంట ప్రేమికులుగా పాల్గొనడం మరింత సెన్సేషనల్‌గా మారింది.బిగ్‌బాస్‌ 12లో అనూప్ జలోటా, జస్రీన్‌ను ఓ వింత జంటగా చూస్తున్నారు. వీరిద్దరి చేరికతో బిగ్‌బాస్ హాట్‌హాట్‌గా మారింది. భక్తీ గీతాలు పాడే ఈ గాయకుడు ఇప్పుడు రక్తితో కార్యక్రమాన్ని హడలెత్తించబొతున్నాడు.

ఆసియాకప్: చెలరేగిన భారత బౌలర్లు.. 162కే పాకిస్తాన్ ఆలౌట్

ఆసియాకప్: చెలరేగిన భారత బౌలర్లు.. 162కే పాకిస్తాన్ ఆలౌట్

ఆసియాకప్ తొలి వన్డేలో హాంగ్‌కాంగ్‌పై తడబడిన బౌలర్లు.. ఇవాళ పాకిస్థాన్‌పై మాత్రం ప్రభావం చూపించారు. ఇండియన్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కేవలం 43.1 ఓవర్లలో కేవలం 162 రన్స్ మాత్రమే చేసింది. భారత బౌలర్లు భువనేశ్వర్, కేదార్ జాదవ్‌లు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. భారీ స్కోర్ సాధిస్తుందని ఆశించిన పాక్.. తక్కువ స్కోర్‌కే చేతులెత్తేసింది. పాక్ టీమ్‌లో అత్యధికంగా బాబర్ 47, మాలిక్ 43 రన్స్ చేశారు. ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా గాయపడ్డా.. అతని స్థానంలో వచ్చిన మనీష్ పాండే ఓ సూపర్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more