Short News

'ఫ్రెండ్‌షిప్ డే' అని మిత్రుల‌కు రూ.46 ల‌క్ష‌లు పంచేశాడు

'ఫ్రెండ్‌షిప్ డే' అని మిత్రుల‌కు రూ.46 ల‌క్ష‌లు పంచేశాడు

ఫ్రెండ్‌షిప్ డే రోజు గొప్ప కోసం మిత్రులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వాలనుకునే వాళ్లూ ఉంటారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లాకు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి అందుకు ఉదాహ‌ర‌ణ‌. అత‌డు ఏకంగా రూ.46 లక్షలు త‌న క్లాస్‌మేట్స్‌కి పంచిపెట్టేశాడు. కొందరికి ఖరీదైన గిఫ్ట్‌లు కొనిచ్చాడు. తీరా ఆ విషయం తెలిసిన ఆ కుర్రాడి తండ్రి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది. ఇంతవరకూ రూ.15 లక్షలు సొమ్ము తిరిగి రాబట్టామని తక్కిన సొమ్ము కూడా రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 
సల్మాన్ సినిమాలో 'ప్రత్యేక' సుందరి

సల్మాన్ సినిమాలో 'ప్రత్యేక' సుందరి

తెలుగులో పలు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించిన 'నోరా ఫతేహి' సల్మాన్ సినిమా 'భారత్'లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో ఆమె లాటిన్ అమెరికన్ యువతిగా నటిస్తోంది. దీనిపై ఆమె మాట్లాడుతూ 'భారత్ సినిమాలో అవకాశం దక్కడం, సల్మాన్, అలీ అబ్బాస్ లాంటి వ్స్శ్రితో పనిచేయడం ఆనందంగా ఉంది. దీని తరువాత మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను లాటిన్ అమెరికన్ పాత్ర పోషిస్తున్నాను. ఇందుకోసం అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకుంటున్నా' అని తెలిపింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తమిళనాడులో విజయ్ దేవరకొండ క్రేజ్ చూసి అంతా షాక్!

తమిళనాడులో విజయ్ దేవరకొండ క్రేజ్ చూసి అంతా షాక్!

'గీత గోవిందం' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... మన పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులోనూ భారీ రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ రష్మిక మందన్న సొంత రాష్టమైన కర్నాటకలో అయితే ఆమె తల్లిదండ్రులు సినిమా చూడటానికి కూడా టిక్కెట్లు దొరకలేదట. ఇక తమిళనాడు విషయానికొస్తే.... అసలు ఎవరూ ఊహించని విధంగా విజయ్ దేవరకొండ చిత్రానికి భారీ అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ఇక సినిమా విడుదలైన తొలి రోజు ఏకంగా రూ 1.30 కోట్ల షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

ప్రకృతి నడుమ 'హార్మని విత్‌ ఏఆర్‌ రెహ్మాన్‌'

ప్రకృతి నడుమ 'హార్మని విత్‌ ఏఆర్‌ రెహ్మాన్‌'

ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహ్మాన్‌ తాజాగా చేసిన స్వర ప్రయోగం 'హర్మని విత్‌ ఏఆర్‌ రెహ్మాన్‌'. కవితాలయ సంస్థ రెహ్మాన్‌ ఈ సంగీత ఆల్బంను రూపొందించారు. దేశంలోని పలు రాష్ట్రాల సంప్రదాయాలు, సంస్కృతుల సమ్మేళనంతో ప్రకృతి నడుమ రూపొందించిన ఈ ఆల్బంను  ఐదు భాగాలుగా రూపొందించారు. దీనిలో కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల్లోని ప్రకృతి భావాలు, వారి సంప్రదాయ సంగీతాలను ఆవిష్కరించారు. ఆయా రాష్ట్ర సంగీత కళాకారులు చేసిన నిరంతర కృషి వంటి అంశాలను పొందుపరిచారు. 
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more