Short News

మేనక వచ్చి ఒళ్లో వాలగానే విశ్వామిత్రుడు తట్టుకోలేకపోయాడు

మేనక వచ్చి ఒళ్లో వాలగానే విశ్వామిత్రుడు తట్టుకోలేకపోయాడు

విశ్వామిత్రుడు తపస్సు చేసే ప్రదేశానికి దగ్గర్లోనే ఒక సరస్సు ఉంటుంది. అందులోకి దిగి జలకాలాటలు ఆడుతూ ఉంటుంది మేనక. ఆ శబ్దానికి కాస్త డిస్ట్రబ్ అవుతాడు విశ్వామిత్రుడు. సరస్సులో నుంచి తుంపరలు వచ్చి విశ్వామిత్రుడిపై పడుతుంటాయి. దీంతో విశ్వామిత్రుడు అలజడికి గురవుతాడు. ఏదో తెలియని గాలి అతన్ని గిలిగింతలుపెడుతూ ఉంటుంది. అప్పటికే ఒక పెద్ద మహర్షిగా మారిన విశ్వామిత్రుడు కూడా ఆ ఆడవాసనకు తట్టుకోలేకపోతాడు. ఎంత నిగ్రహంతో ఉందామన్నా ఉండలేకపోతాడు. తర్వాత కళ్లు తెరిచి చూస్తాడు. మేనక అందాన్ని చూసి ఉబ్బితబ్బిపోతాడు. అస్సలు తట్టుకోలేకపోతాడు.

క్యాప్‌ డ్యాన్స్‌ చాలా ఈజీ ..నేను నేర్పిస్తా

క్యాప్‌ డ్యాన్స్‌ చాలా ఈజీ ..నేను నేర్పిస్తా

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అల్లు అర్జున్‌లా క్యాప్‌తో డ్యాన్స్‌ చేయాలని కథానాయిక సమంత తెగ ప్రయత్నించిందట. ఎటువంటి ఎఫెక్ట్స్‌‌ ఉపయోగించకుండా బన్నీ స్వతహాగా చేసిన ఆ డ్యాన్స్‌ను మూడు నెలలు సాధన చేసినా ఫలితం లేదని ట్విటర్‌లో పేర్కొంది. 'ఈ పాట (ఏడుస్తున్న ఎమోజీలు) నేను చేయలేకపోయాను. క్యాప్‌తో మూడు నెలలు సాధన చేసాను. అల్లు అర్జున్‌ కష్టపడటంలో నెంబర్‌ వన్‌' పోస్ట్‌ చేసింది. ఆ ట్వీట్‌ చూసిన బన్నీ ప్రతిస్పందిస్తూ 'ధన్యవాదాలు సామ్‌. మీకు ట్రిక్స్‌ నేర్పించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది చాలా సులభం' అని బదులిచ్చారు.  
సాధారణ అమ్మాయిలా ఉండలేను

సాధారణ అమ్మాయిలా ఉండలేను

సాధారణ మహిళగా ఉండటం త‌న‌ వల్ల కాదు అంటోంది నటి అమలాపాల్‌. ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నీ వెంట వెంటనే ఎదుర్కొన్న ఈ సంచలన నటి హీరోయిన్‌గా మాత్రం కేరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. అయితే మునుపంత దూకుడు లేదు. గ్లామరస్‌ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేయడం లాంటి ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్న అమలాపాల్‌ తాను చాలా మందిలా సాధారణ అమ్మాయిలా ఉండలేను అంటూ మరోసారి వార్తలకెక్కింది. నటి అన్నాక గ్లామర్‌ పాత్రలనే కాకుండా అన్ని రకాల పాత్రలను చేయాలని.. అమ్మగా నటించడానికి త‌న‌కెలాంటి అభ్యంత‌ర లేద‌ని చెప్పింది.   
నాజూగ్గా ఉండ‌టానికి తెగ క‌ష్ట‌ప‌డుతోంది

నాజూగ్గా ఉండ‌టానికి తెగ క‌ష్ట‌ప‌డుతోంది

కొందరు భామలకు బొద్దుగా ఉండడమే ముద్దు. మరికొందరు మాత్రం సన్నగా నాజూగ్గా ఉండటానికి నానా పాట్లు పడుతుంటారు. అందుకోసం నోరు కూడా కుట్టేసుకుంటారు. నటి రకుల్‌ప్రీత్ సింగ్‌ తిండి విషయం ఏమోగానీ, స్లిమ్‌గా ఉండటానికి మాత్రం చాలా పాట్లు పడుతోంది. కోలీవుడ్‌లో నిరాశకు గురై టాలీవుడ్‌కు వెళ్లి అక్కడ అందం, అదృష్టం అందలమెక్కించడంతో క్రేజీ హీరోయిన్‌గా టపటపా అరడజనుకు పైగా చిత్రాలు చేసేసింది. ఆ తరువాత అక్కడ కాస్త అవకాశాలు దోబూచుటాడడంతో మళ్లీ కోలీవుడ్‌ను ఆశ్రయించింది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో రెండు చిత్రాలున్నాయి.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more