Short News

ఆగస్టు 26 నుండి సెప్టెంబరు1 వరకు మీ 'అదృష్టం'

ఆగస్టు 26 నుండి సెప్టెంబరు1 వరకు మీ 'అదృష్టం'

మేషం: ఆర్థికంగా మంచిఫలితం పొందుతారు. వృషభం:వారం మధ్యలో లాభాలున్నాయి. మిథునం:ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కర్కాటకం:జాగ్రత్తగా ఆలోచిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. సింహం:శుభవార్త వింటారు. కన్య:ఆర్థికంగా మంచి ఫలితం ఉంటుంది. తుల: చిత్తశుద్ది మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వృశ్చికం: అనుకున్నది సాధిస్తారు. ధనస్సు:పొరపాట్లు జరగకుండా పనులు పూర్తి చేయండి. మకరం: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.కుంభం:కీర్తి ప్రతిష్ఠలతో కూడిన విజయాలున్నాయి. మీనం: శక్తి వంచన లేకుండా పనిచేస్తే తప్పక కార్యసిద్ధి లభిస్తుంది.
‘చురకే దిల్‌ మేరా' పాటకు జాదవ్‌ డాన్స్ అదరహో!

‘చురకే దిల్‌ మేరా' పాటకు జాదవ్‌ డాన్స్ అదరహో!

టీమిండియా ఆటగాడు కేదార్‌ జాదవ్‌ మ్యాచ్‌పూర్తయిన అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో చేసిన డ్యాన్స్‌ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంది. జాదవ్ డాన్స్ చేస్తున్నప్పుడు సహ ఆటగాళ్లు వీడియోతీసి సామాజికమాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి నర్తించిన ‘చురకే దిల్‌ మేరా' పాటకు జాదవ్‌ తన స్టైల్‌లో స్టెప్పులేశాడు. దీంతో పాటు మరోపాటలో క్రికెట్ బ్యాటును గిటార్‌ చేసుకుని కాలుకదపడం నెట్టింట్లో అభిమానులను అలరిస్తోంది.
చంద్రబాబు బయోపిక్  ‘చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది

చంద్రబాబు బయోపిక్ ‘చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంక్ ‘చంద్రోదయం. ఈ చిత్రం పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.వి.కె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే సొమవారం ఈ సినిమాలోని ఆయన పాత్ర లుక్‌ను విడుదల చేశారు.‘చంద్రోదయం' చిత్రీకరణ పూర్తయిందన్నారు నిర్మాత రాజేంద్ర. అక్టోబర్‌లో పాటలను, వెనువెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..'' అని అన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి టీపీసీసీ మరోసారి షోకాజ్‌ నోటీసులు

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి టీపీసీసీ మరోసారి షోకాజ్‌ నోటీసులు

కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి టీపీసీసీ మరోసారి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఏఐసీసీ ప్రకటించిన కమిటీలపై రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తొలుత జారీ చేసిన షోకాజ్‌ నోటీసులపై ఆయన ఇచ్చిన మూడు పేజీల వివరణకు సంతృప్తి టీపీసీసీ చెందలేదు. అంతేకాకుండా క్రమశిక్షణ అంశాలపై సరైన సమాధానం రాలేదని కమిటీ భావించింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ప్రెస్‌ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆయా వ్యాఖ్యలను ఉటంకిస్తూ 24 గంటల్లోగా జవాబు ఇవ్వాలని కమిటీ తాజాగా ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more