Short News

ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికే హానికరం

ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికే హానికరం

ప్లాస్టిక్ వాడకం మనందరి జీవితాలతో గాఢంగా పెనవేసుకుపాయింది. ఎటు చూసినా ప్లాస్టిక్. స్టోరేజ్ కంటైనర్లు నుంచి వాటర్ బాటిల్స్ వరకు అన్నీ ప్లాస్టిక్. ప్లాస్టిక్ తో తయారైనవే ప్రిఫర్ చేసి మరీ వాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ అయిన కంప్యూటర్స్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ వంటి టెక్నలాజికల్ అడ్వాన్స్మెంట్స్ కి ప్లాస్టిక్ ఎంతగానో దోహదం చేసిందన్న అంశాన్ని విస్మరించకూడదు. అయితే, ప్లాస్టిక్ ని ఫుడ్ కి సంబంధించిన విషయంలో వాడటం మాత్రం మంచిది కాదు. ఈ ఆర్టికల్ లో ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లని ఎందుకు అవాయిడ్ చేయాలో వివరించాము.

ఆసియాకప్ : గాయపడ్డ హార్ధిక్ పాండ్యా..షాక్ లో టీమిండియా

ఆసియాకప్ : గాయపడ్డ హార్ధిక్ పాండ్యా..షాక్ లో టీమిండియా

పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. 18వ ఓవర్‌లో బౌలింగ్ వేస్తూ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కిందపడ్డాడు. కిందపడ్డ తర్వాత పాండ్యా లేవలేకపోయాడు. దాంతో స్ట్రెచర్ తీసుకువచ్చి.. పాండ్యాను తీసుకువెళ్లారు. పాండ్యా ఓవర్‌లోని చివరి బంతిని రాయుడు వేశాడు. పాండ్యాకు తీవ్ర‌మైన వెన్ను నొప్పి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అత‌ను లేచి నిల‌బ‌డుతున్నాడ‌ని డాక్ట‌ర్లు తెలిపారు.
సెప్టెంబర్ 24న అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైల్ లైన్ ప్రారంభం

సెప్టెంబర్ 24న అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైల్ లైన్ ప్రారంభం

సెప్టెంబర్ 24న హైదరాబాద్ లో అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైల్ లైన్ ప్రారంభం కానుంది. ఈ నెల 24న మధ్యాహ్నం 12.15 గంటలకు.. అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో లైన్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు సీఎస్ ఎస్‌కే జోషి, ఎంఏఅండ్‌యూడీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ఆ నివేదిక సిఎం చంద్రబాబే రాసినట్టుంది:వాసిరెడ్డి పద్మ

ఆ నివేదిక సిఎం చంద్రబాబే రాసినట్టుంది:వాసిరెడ్డి పద్మ

పుష్కరాల దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కాపాడటానికే జస్టిస్‌ సోమాయాజులు నివేదిక ఇచ్చారని వైసిపి అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. బుధవారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. జస్టిస్ సోమయాజులు తన నివేదికలో తప్పంతా భక్తులదేనని, మూఢ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని రిపోర్ట్ ఇవ్వడం సిగ్గుచేటని ఆమె దుయ్యబట్టారు. అసలు సోమయాజులు కమిటీ ఎందుకు వేశారు, కానీ ఆయన ఏం తేల్చారని ఆమె నిలదీశారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more