Short News

అనుష్క శర్మ భారత జట్టులో సభ్యురాలా.?

అనుష్క శర్మ భారత జట్టులో సభ్యురాలా.?

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా బృందం లండన్‌లో భారత హై కమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను బీసీసీఐ  ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ఆటగాళ్ళు, సహాయ సిబ్బందితో పాటు కోహ్లి సతీమణి నటి అనుష్క కూడా ఉంది. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ళు క్రికెట్‌ ఆడటానికి వెళ్ళారా? లేక సతీమణులతో హనీమూన్‌ చేసుకోవడానికా అని మండిపడుతున్నారు. జట్టు అధికారిక మీట్‌కు అనుష్క హాజరు కావడం ఏమిటని సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఖడ్గసమేతుడు ఈ 'వీరరాఘవ'

ఖడ్గసమేతుడు ఈ 'వీరరాఘవ'

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆగస్ట్‌ 15న  విడుదలయ్యి సంచలన హిట్ సాధించింది. జగపతిబాబు చెప్తున్న సీమ యాస డైలాగుల మధ్య ఎన్టీఆర్‌ చేసే పోరాట ఘట్టాలు అభిమానులను అలరిస్తున్నాయి. టీజర్లో తారక్‌ లుక్‌ అద్భుతంగా ఉందంటూ ప్రముఖులు ట్వీట్లు పెడుతున్నారు. 'తారక్‌ లైవ్‌ కరెంట్‌ తీగలా ఉన్నాడు. నిజంగానే పులిలా వేటాడుతున్నట్లు కనిపించాడు. ఖడ్గ సమేతుడులా నరకడం మొదలుపెట్టాక ఎనకా ముందు చూసేది లేదు అన్నట్టున్నాడు' అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.   
ఎపి:అసలైన అధికార చిహ్నం అదికాదు...ఇది!

ఎపి:అసలైన అధికార చిహ్నం అదికాదు...ఇది!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార చిహ్నం అనగానే 'పూర్ణ కుంభం' అనేది జనరల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం...కానీ నిజానికి ఆ ఆన్సర్ తప్పు!...అదేంటి?...ఎన్నో ఏళ్లుగా అందరూ అదే కరెక్టని అంటున్నారు...అనడమే కాదు...ఎన్నో పోటీల్లో ఆ జవాబుతో బహుమతులు కూడా గెల్చుకున్నాం అనుకుంటున్నారా?...కానీ నిజంగానే ఆ సమాధానం తప్పు...అసలు నిజానికి ఆ ప్రశ్నకు సరైన సమాధానం పూర్ణ కుంభం కాదు...పూర్ణ ఘటం.1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలిసారిగా అధికారిక చిహ్నాన్ని రూపొందించేందుకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇచ్చారు.

మాల్యాకు షాకిచ్చిన లండన్‌ హైకోర్టు

మాల్యాకు షాకిచ్చిన లండన్‌ హైకోర్టు

లిక్కర్‌ విజయ్‌ మాల్యాకు లండన్‌ హైకోర్టు షాకిచ్చింది. భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు లీగల్‌ ఫీజుల కింద రూ.1.5 కోట్లను చెల్లించాలని ఆదేశించింది. బ్యాంకులకు వ్యతిరేకంగా అతను నమోదు చేసిన కేసు కొట్టివేసిన అనంతరం వారి లీగల్‌ ఫీజులు వారికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 9 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిన మాల్యాను ప్రస్తుతం భారత్‌కు అప్పగించే ప్రక్రియపై లండన్‌ కోర్టులో విచారణ జరుగుతుంది. మాల్యా ఇప్పటికే లీగల్‌ ఫీజుల కింద రూ.1.8 కోట్లను చెల్లించారు. తాజాగా మరో రూ.1.5 కోట్లను చెల్లించాల్సి ఉంది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more