Short News

పురుషుల షాట్‌పుట్‌ లో భారత్ కు  పసడి పతకం

పురుషుల షాట్‌పుట్‌ లో భారత్ కు పసడి పతకం

ఆసియా క్రీడల్లో భారత్‌ ఏడో స్వర్ణం గెలుచుకుంది. పురుషుల షాట్‌పుట్‌ విభాగంలో తూర్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌ పసడి పతకం కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోటీలో తజిందర్‌పాల్‌ గుండును 20.75 మీటర్లు విసిరి ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందజేశాడు. ఐదో ప్రయత్నంలో అతడు ఈ ఘనత సాధించాడు. చైనా ఆటగాడు లియూ యంగ్‌ 19.52 మీటర్లతో (సీజన్‌బెస్ట్‌) రజతం, కజకిస్థాన్‌ అథ్లెట్‌ ఇవనోవ్‌ ఇవాన్‌ 19.40తో కాంస్యం అందుకున్నాడు.
బిగ్ బాస్ ఫైన‌ల్‌కు నాగార్జున, ఎన్టీఆర్

బిగ్ బాస్ ఫైన‌ల్‌కు నాగార్జున, ఎన్టీఆర్

'బిగ్ బాస్' సీజ‌న్ 2 కార్యక్రమానికి వ‌చ్చే వారం ముగింపు ప‌డ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌స్తుతం కేవ‌లం ఆరుగురు స‌భ్యులున్నారు. వారిలో ఒక‌రు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఈ కార్య‌క్ర‌మం ఫైన‌ల్‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని నిర్వాహ‌కులు భావిస్తుండగా, కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా నాగార్జున‌ని ఆహ్వానించిన‌ట్టు వార్త‌లు రాగా సీజ‌న్1 కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన ఎన్టీఆర్ కూడా ఫినాలేకి హాజ‌రు కానున్నాడ‌ని అంటున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే నాని, నాగార్జున‌, ఎన్టీఆర్‌ల సంద‌డి చేయనున్నారు.
ఐబీపీఎస్‌లో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఐబీపీఎస్‌లో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్‌లో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7275 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 10 అక్టోబర్,2018.


సంస్థ పేరు : ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్
మొత్తం పోస్టుల సంఖ్య : 7275
పోస్టు పేరు : క్లర్క్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 10 అక్టోబర్ 2018

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టి, తిరిగి జుట్టు పెరుగుదలలో సహాయం చేసే గుడ్డు

జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టి, తిరిగి జుట్టు పెరుగుదలలో సహాయం చేసే గుడ్డు

దీర్ఘకాలం, ఆరోగ్యకరమైన మరియు నునుపుగా ఉండే జుట్టును కలిగి ఉండడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఆరోగ్యకరమైన మరియు దృఢమైన జుట్టు కలిగి ఉండే క్రమంలో, జుట్టు రాలడం మరియు చుండ్రు వంటి సమస్యలను నివారించడం అన్నిటికన్నా ముఖ్యం. వాతావరణం మరియు నీటిలో మార్పులు(ముఖ్యంగా PH విలువలు,) రసాయనాల మితిమీరిన వాడుక, తాపన ఉత్పత్తులు, ఎండ ప్రభావం మరియు హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాల వలన హెయిర్ ఫాల్ సమస్యలు ఏర్పడుతాయి.చికిత్స కోసం, మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్నిరకాల ఉత్పత్తులతో ప్రయోగాలు చేసేస్తాము. క్రమంగా జుట్టు నష్టం మరింత పెరుగుతుంది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more