Short News

స్క్వాష్‌లో భారత్ కు తొలి పతకం.. కాంస్యం గెలిచిన దీపికా

స్క్వాష్‌లో భారత్ కు తొలి పతకం.. కాంస్యం గెలిచిన దీపికా

ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. శనివారం పోటీల్లో భాగంగా భారత్ స్క్వాష్‌లో తొలి పతకం సాధించింది. స్క్వాష్‌ మహిళల సింగిల్స్‌లో భారత్‌కు చెందిన దీపికా పల్లికల్ కాంస్య పతకం సాధించింది. సెమీస్‌లో భాగంగా మలేసియాకు చెందిన నికోల్ డేవిడ్‌తో తలపడిన దీపికా పల్లికల్ 0-3తో ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. తాజా పతకంతో ఆసియా గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య 26కు చేరింది.
ఇప్పుడే చెడ్డవాళ్లమయ్యామా?: కొండాకు కేటీఆర్ కౌంటర్

ఇప్పుడే చెడ్డవాళ్లమయ్యామా?: కొండాకు కేటీఆర్ కౌంటర్

టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శల దాడికి దిగిన కొండా సురేఖ దంపతులపై మంత్రి కేటీఆర్ అదే స్థాయిలో విమర్శలు చేశారు. టీఆర్ఎస్‌లో ఉన్నంత కాలం కొండా దంపతులకు తాము మంచి వాళ్లమని, పార్టీ నుంచి వెళ్లిపోయే ముందు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్పై విమర్శలు చేసి అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు చూస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల ప్రజా బలమెంతో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారన్నారు.

రీమేక్‌పై నాని నజర్.. 96 లక్కీ నంబర్ అవుతుందా?

రీమేక్‌పై నాని నజర్.. 96 లక్కీ నంబర్ అవుతుందా?

వరుస విజయాలతో దుమ్మురేపిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తడబాటుకు లోనయ్యారు. కృష్ణార్జున యుద్ధం ఆశించినంత సక్సెస్‌ను అందించలేకపోయింది. ఆ చిత్రం తర్వాత నాగార్జునతో కలిసి దేవదాస్ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. దేవదాస్ చిత్రం తర్వాత జెర్సీ అనే చిత్రంలో నాని నటిస్తున్నాడు. ఆ తర్వాత నాని తమిళ రీమేక్ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 చిత్రం కోలీవుడ్‌లో అక్టోబర్ 4న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో నాని నటింప జేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి

కాజోల్ నంబరుతో అభిమానులను 'ప్రాంక్' చేసాడు

కాజోల్ నంబరుతో అభిమానులను 'ప్రాంక్' చేసాడు

బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ అభిమానులను ఆటపట్టించాడు. సోమవారం మధ్యాహ్నం అజయ్‌ 'కాజోల్‌ ప్రస్తుతం ఇండియాలో లేదు.  98******** తన వాట్సాప్‌ నంబర్‌ ఇది. ఈ నెంబర్‌ ద్వారా ఆమెను సంప్రదించగలరు' అంటూ ట్వీట్‌ చేసాడు. దాంతో అభిమానులు కాజల్‌తో మాట్లాడవచ్చని ఆ నంబరుకు మెసేజ్‌లు పెట్టి రిప్లై కోసం ఎదురు చూసారు. 'రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం సార్‌' అంటూ స్ర్కీన్‌షాట్లు తీసి అజయ్‌కు పంపించారు. 'సినిమాల్లో ప్రాంక్‌ చేసి చేసి బోర్‌ కొట్టింది. అందుకే వెరైటీగా మిమ్మల్ని ప్రాంక్‌ చేసా' అంటూ చల్లగా చెప్పాడు. 
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more