Short News

గాడ్ ఆఫ్ క్రికెట్ స‌చిన్ కాదు ధోనీ!

గాడ్ ఆఫ్ క్రికెట్ స‌చిన్ కాదు ధోనీ!

‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌' సచిన్‌ కాదని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి. శనివారం సునీల్‌ తన పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు ఎంతో ఇష్టమైన ధోనీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. క్రికెట్‌ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ఐపీఎల్‌ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ‘ధోనీ ఎప్పటికీ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వకూడదు. సరైన వ్యక్తిని కెప్టెన్‌గా ఎంపికచేయగల సామర్థ్యం ఉన్నవాడు ధోనీ.' అని వెల్లడించారు సునీల్‌.    
బిగ్‌బాస్ నుంచి దీప్తి సునైన అవుట్.. స్విమ్మింగ్ పూల్‌లో దూకిన తనీష్!

బిగ్‌బాస్ నుంచి దీప్తి సునైన అవుట్.. స్విమ్మింగ్ పూల్‌లో దూకిన తనీష్!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 70వ రోజున ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఎలిమినేషన్‌కు ముందు గీత గోవిందం దర్శకుడు పరుశురాం, హీరో విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత దీప్తి సునైనతో సీక్రెట్ టాస్క్‌ను నానీ, విజయ్, పరుశురాం పర్యవేక్షణలో జరిపించారు. టాస్క్‌లో భాగంగా గీతా, సామ్రాట్‌ను లడ్డుతో కొట్టింది. నిద్రిస్తున్న అమిత్‌పై నీళ్లు పోసింది. ఈ వారం దీప్తి సునైనా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది.

‘భైరవ గీత’కు నిర్మాత కావ‌డం గ‌ర్వంగా ఉంది

‘భైరవ గీత’కు నిర్మాత కావ‌డం గ‌ర్వంగా ఉంది

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మాతగా మారి రూపొందిస్తున్న సినిమా ‘భైరవ గీత'. సిద్దార్ధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ నటుడు ధనంజయ హీరోగా నటిస్తుండగా.. ఐరా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఐరా స్టిల్‌తో పాటు మరో రెండూ పోస్టర్స్ ప్రేక్షకులతో పంచుకున్న వర్మ.. తాను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలిపాడు.‘గత పదేళ్లల్లో నేను చూసిన ప్రామిసింగ్‌ దర్శకుడు సిద్ధార్థ్‌. అతన్ని ఈ సినిమాతో మీ ముందుకు తీసుకురావటం అదృష్టంగా భావిస్తున్నా' అని ట్వీట్ చేశారు.  
ప‌వ‌న్ దేశ‌భ‌క్తి ట్వీట్‌కు అమితాబ్ 'జై హింద్‌'

ప‌వ‌న్ దేశ‌భ‌క్తి ట్వీట్‌కు అమితాబ్ 'జై హింద్‌'

టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న ప‌వన్ క‌ళ్యాణ్‌కి దేశంతో పాటు స‌మాజంపై ప్ర‌త్యేక గౌరవం ఉంది. నటుడిగా, నాయ‌కుడిగా అభిమాన గ‌ణాన్ని భారీగా పెంచుకున్న ప‌వ‌న్ తాజాగా దేశ రక్షణ కోసం సర్వ శక్తులు ఒడ్డి ప్రజల్ని రక్షిస్తున్న ఇండియన్ ఆర్మీ సత్తాని, సైనికుల గొప్పదనాన్ని తెలియజేస్తూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. ఆర్మీ గురించి ప్రముఖులు, సైనిక అధికారులు పలు సందర్భాల్లో తెలిపిన మాటలు కూడా అందులో ఉన్నాయి. తాజాగా ఆ ట్వీట్‌పై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ స్పందించారు. పవన్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ జై హింద్ అని తన దేశభక్తిని తెలియజేశారు.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more