Short News

రోడ్డు ప్రమాదంలో అథ్లెట్‌ 'నికోలస్‌ బెట్‌' దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో అథ్లెట్‌ 'నికోలస్‌ బెట్‌' దుర్మరణం

కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్‌ నికోలస్‌ బెట్‌(28) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హర్డల్స్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొని వెళ్తుండగా మంగళవారం రాత్రి నాంది కౌంటీలో బెట్‌ ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్ళింది. తీవ్రంగా గాయపడిన బెట్‌ ప్రమాద స్థలంలోనే మృతి చెందాడని అధికారులు తెలిపారు. రెండుసార్లు ఆఫ్రికా హర్డిల్ ఛాంపియన్ షిప్ సాధించిన బెట్‌ 2015లో జరిగిన 400 మీటర్ల హర్డల్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు.  
ఫ్యాషన్‌ను పక్కన పెట్టి..మ్యాచ్‌పై దృష్టి పెట్టు

ఫ్యాషన్‌ను పక్కన పెట్టి..మ్యాచ్‌పై దృష్టి పెట్టు

ఫ్యాషన్‌పై కాకుండా మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తన ఇన్‌స్టాగ్రాంలో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌తో ఉన్న పాండ్య ఎంతో స్టైల్‌గా కనిపించాడు. ఈ ఫొటోను చూసిన అభిమానులు పాండ్య ఫ్యాషన్‌పై కాదు మ్యాచ్‌పై దృష్టి పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్‌లో బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లు ఉన్నావుగా; లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత ఎన్ని ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నావో చెప్పు' అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
ఆ రెండు బ్లాక్ బస్టర్స్ కంటే భిన్నంగా.. స్టార్ హీరోతో సినిమా గురించి యువ దర్శకుడు!

ఆ రెండు బ్లాక్ బస్టర్స్ కంటే భిన్నంగా.. స్టార్ హీరోతో సినిమా గురించి యువ దర్శకుడు!

రాజా రాణి వంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో అందరిని ఆకర్షించిన యువ దర్శకుడు అట్లీ ఆ తరువాత తెరకెక్కించిన తేరి, మెర్సల్ చిత్రాలతో ఆశ్చర్యపరిచాడు. ఆ రెండు చిత్రాలతో అట్లీ పేరు మారుమ్రోగింది. అట్లీ మూడోసారి స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అట్లీ మాట్లాడుతూ విజయ్ చిత్రం గురించి స్పందించాడు. ఓ విభిన్నమైన కోణంలోకథని రాస్తున్నా. తేరి, మెర్సల్ చిత్రాలకంటే ఈ కథ పూర్తి భిన్నంగా ఉంటుంది అని అట్లీ తెలిపాడు. విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయంగా బ్యాంకింగ్‌, లోహ, ఔషధ రంగ షేర్లలో కొనుగోళ్లతో దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ దాదాపు 300 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 11,450 మార్క్‌ను దాటి సరికొత్త రికార్డును నమోదుచేసింది. రోజంతా లాభాల జోరులో సాగిన సూచీ చివరకు 284 పాయింట్లు లాభపడి 37,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 86 పాయింట్లు లాభపడి 11,471 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more