Short News

‘రన్‌ ఆడం’కు ప్రచారకర్తగా మహేంద్రసింగ్ ధోని

‘రన్‌ ఆడం’కు ప్రచారకర్తగా మహేంద్రసింగ్ ధోని

‘రన్‌ ఆడం' సంస్థకు భారత స్టార్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. దేశంలోనే తొలి 360 డిగ్రీల పర్యావరణ సహిత క్రీడా సాంకేతిక సంస్థగా ‘రన్‌ ఆడం'నిలిచింది. ప్రతిభావంతులైన క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు రన్‌ ఆడం సంస్థ కృషి చేస్తోంది. ధోని బ్రాండ్ అంబాసిడర్ గానే కాదు.. ఈ కంపెనీలో ఇప్పటికే 25శాతం వాటా కూడా తీసుకున్నారు. స్థానిక క్రీడాకారుల కలలను నెరవేర్చేందుకు రన్‌ ఆడం ఒక వారధిగా నిలుస్తుందని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ సందర్భంగా ధోనీ పిలుపునిచ్చారు.
డెలివరీ ఎప్పుడో తెలియదు, జియోఫోన్ 2 బుకింగ్స్ రేపటి నుంచే,బుకింగ్ ఎలా?

డెలివరీ ఎప్పుడో తెలియదు, జియోఫోన్ 2 బుకింగ్స్ రేపటి నుంచే,బుకింగ్ ఎలా?

దేశీయ మొబైల్ మార్కెట్లోకి సునామిలాగా దూసుకొచ్చిన జియో అత్యంత తక్కువ ధరకే జియోఫోన్ ను తీసుకొచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ విజయవంతమైన నేపథ్యంలో జియోఫోన్ 2 పేరుతో మరో సరికొత్త ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ ఫోన్ బుకింగ్స్ రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జూలైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ జియో ఫోన్ 2పై ప్రకటన చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే రేపటి నుంచి జియో ఫోన్ 2 కు గాను బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. మరి బుకింగ్ ప్రాసెస్ ఎలా అంటే..

భార‌త ప్ర‌ధాని ఒప్పుకుంటే ఆయ‌న‌కు పెళ్లి సంబంధం చూస్తా!

భార‌త ప్ర‌ధాని ఒప్పుకుంటే ఆయ‌న‌కు పెళ్లి సంబంధం చూస్తా!

భార‌త ప్ర‌ధాని మోదీ గనక పెళ్లికి ఒప్పుకుంటే ఆయన కోసం వధువును చూస్తాను అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌! గతేడాది వీరిద్ద‌రి మ‌ధ్య సమావేశం సందర్భంగా ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ‘పొలిటికో' వెలువరించింది. ట్రంప్‌ విదేశీ నేతల సమావేశాల సందర్భంగా మర్చిపోయిన మర్యాదల గురించి ‘దౌత్య సమావేశాలు - తప్పిదాలు' పేరిట ప్ర‌చురించిన క‌థ‌నంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. మోదీ ఒంట‌రిగా అమెరికా వ‌స్తున్నార‌ని వైట్ హౌస్ అధికారులు చెప్పిన‌ప్పుడు ట్రంప్ పెళ్లి సంబంధం గురించి జోక్ చేశార‌ట‌!   
'రియల్' భర్తతో సమయాన్ని గడపలేకపోతున్నా

'రియల్' భర్తతో సమయాన్ని గడపలేకపోతున్నా

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, వరుణ్‌ ధావన్‌ జంటగా నటించిన చిత్రం 'సూయీ ధాగా'. శరత్‌ కటారియా దర్శకత్వం వహించిన చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ 'ఈ సినిమాలో నేను గృహిణిగా ఇంటి పట్టునే ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి పాత్రల్లో ఇంతకుముందు నేనెప్పుడూ నటించలేదు. సినిమాలో నేను రీల్‌ భర్తతో కలిసి గడిపిన సమయాన్ని భర్త విరాట్‌తో కలిసి గడపలేకపోతున్నాను' అని వెల్లడించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more