Short News

లార్డ్స్ టెస్ట్ ..తొలి ఇన్నింగ్స్ లో భారత్ 107 ఆలౌట్

లార్డ్స్ టెస్ట్ ..తొలి ఇన్నింగ్స్ లో భారత్ 107 ఆలౌట్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్‌ చేతులెత్తేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్ దారి పట్టారు. ఆరంభంలో ఆండర్సన్ ఓపెనర్లను పెవిలియన్ పంపగా వోక్స్ కోహ్లీ వికెట్‌ పడగొట్టి ఆ వెంటనే పాండ్య (11)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌(1) రహానే (18) ఔటయ్యారు. కుదురుకుంటున్న అశ్విన్ (29)ని బ్రాడ్ ఔట్ చేసాడు. తరువాత ఎవరూ నిలబడలేకపోవటంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 35.2 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆండర్సన్ 5 వికెట్లు తీసాడు.
భార‌త ప్ర‌ధాని ఒప్పుకుంటే ఆయ‌న‌కు పెళ్లి సంబంధం చూస్తా!

భార‌త ప్ర‌ధాని ఒప్పుకుంటే ఆయ‌న‌కు పెళ్లి సంబంధం చూస్తా!

భార‌త ప్ర‌ధాని మోదీ గనక పెళ్లికి ఒప్పుకుంటే ఆయన కోసం వధువును చూస్తాను అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌! గతేడాది వీరిద్ద‌రి మ‌ధ్య సమావేశం సందర్భంగా ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ‘పొలిటికో' వెలువరించింది. ట్రంప్‌ విదేశీ నేతల సమావేశాల సందర్భంగా మర్చిపోయిన మర్యాదల గురించి ‘దౌత్య సమావేశాలు - తప్పిదాలు' పేరిట ప్ర‌చురించిన క‌థ‌నంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. మోదీ ఒంట‌రిగా అమెరికా వ‌స్తున్నార‌ని వైట్ హౌస్ అధికారులు చెప్పిన‌ప్పుడు ట్రంప్ పెళ్లి సంబంధం గురించి జోక్ చేశార‌ట‌!   
'రియల్' భర్తతో సమయాన్ని గడపలేకపోతున్నా

'రియల్' భర్తతో సమయాన్ని గడపలేకపోతున్నా

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, వరుణ్‌ ధావన్‌ జంటగా నటించిన చిత్రం 'సూయీ ధాగా'. శరత్‌ కటారియా దర్శకత్వం వహించిన చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ 'ఈ సినిమాలో నేను గృహిణిగా ఇంటి పట్టునే ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి పాత్రల్లో ఇంతకుముందు నేనెప్పుడూ నటించలేదు. సినిమాలో నేను రీల్‌ భర్తతో కలిసి గడిపిన సమయాన్ని భర్త విరాట్‌తో కలిసి గడపలేకపోతున్నాను' అని వెల్లడించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
ఎన్టీఆర్ బయోపిక్: నారా భువనేశ్వరి పాత్రలో మలయాళీ బ్యూటీ!

ఎన్టీఆర్ బయోపిక్: నారా భువనేశ్వరి పాత్రలో మలయాళీ బ్యూటీ!

అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందుతోంది. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర వెండి తెరపై జనరంజకంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో నటీనటుల ఎంపికే పెద్ద సవాల్. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్ర వహించిన ప్రముఖుల పాత్రలకు సరైన నటుల్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. క్రిష్ ఆ పనిలోనే ఉన్నాడు. తాజగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. నారా చంద్రబాబు నాయుడు పాత్ర కోసం దగ్గుబాటి రానా ఎంపికైన సంగతి తెలిసిందే.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more