Short News

నేటి నుంచి యూఎస్ ఓపెన్‌.. సెరెనాపైనే అంద‌రి చూపు

నేటి నుంచి యూఎస్ ఓపెన్‌.. సెరెనాపైనే అంద‌రి చూపు

రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌, నొవాక్‌ జకోవిచ్‌, ఆండీ ముర్రే.. ప‌దిహేనేళ్లుగా పురుషుల టెన్నిస్‌ను శాసిస్తున్న చతుష్టయం. చాన్నాళ్ల తర్వాత ఈ నలుగురూ కలిసి పూర్తి ఫిట్‌నెస్‌, చక్కటి ఫామ్‌తో బరిలోకి నిలుస్తున్న టోర్నీ యుఎస్‌ ఓపెన్‌. సోమవారం నుంచి ఆరంభమయ్యే ఈ టోర్నీలో వీరి ఆటే ప్రధాన ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు. ఫెదరర్‌, నాదల్‌ రెండేళ్ల నుంచి మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో అందరి చూపు సెరెనా మీదే ఉంది. మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు (24) అందుకోవడానికి సెరెనా ఒక టైటిల్‌ దూరంలో ఉంది.   
మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పకనే చెప్పిన ప్రధాని మోడీ

మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పకనే చెప్పిన ప్రధాని మోడీ

2019లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న ఒడిషా ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. ఒడిషాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రధాని మోడీ. బొగ్గు గ్యాస్ ఆధారిత ఫర్టిలైజర్ ప్లాంట్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఫర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం 2000లో తీసుకోవడం జరిగిందని ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు.

దేవదాస్ మూవీ ఆ చిత్రానికి రీమేకా!

దేవదాస్ మూవీ ఆ చిత్రానికి రీమేకా!

శ్రీరామ్ ఆదిత్య దర్శత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జున, నాని కలసి నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నాగార్జున దేవాగా డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. నాని దాస్ పాత్రలో డాక్టర్ గా కనిపించబోతున్నాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం దేవదాస్ చిత్రం హాలీవుడ్ మూవీ 'అనలైజ్ దిస్' కు రీమేక్ అని నెటిజన్లు అంటున్నారు. అనలైజ్ దిస్ చిత్రం 1999 లో వచ్చింది.

రజనీకాంత్‌ తర్వాతి సినిమా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో?

రజనీకాంత్‌ తర్వాతి సినిమా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో?

రజనీకాంత్ హీరోగా ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పెట్ట' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే దీని తర్వాత రజనీకాంత్ చేయబోయే మూవీ కూడా ఇదే సంస్థ నిర్మించబోతోందని, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని టాక్. పలు హిట్ చిత్రాలు అందించి ఏఆర్ మురుగదాస్ ఇటీవల రజనీకాంత్‌కు ఓకే చెప్పారని, సూపర్ స్టార్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more