Short News

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రక్షాబంధన్ ఆఫర్

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రక్షాబంధన్ ఆఫర్

బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రక్షాబంధన్ ఆఫర్ ప్రకటించింది. రూ.399 పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌ను కస్టమర్లు రీచార్జి చేసుకుంటే వారికి అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 74 రోజులుగా నిర్ణయించారు. రాఖీ పండుగ సందర్భంగా ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టామని, రేపటి నుంచి ఈ ప్లాన్‌ను కస్టమర్లు రీచార్జి చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారి ఒకరు చెప్పారు.
మోటార్ షెల్ పేలి 8 మంది చిన్నారులు దుర్మరణం

మోటార్ షెల్ పేలి 8 మంది చిన్నారులు దుర్మరణం

ఆఫ్ఘనిస్తాన్‌లో మోటార్ షెల్‌ పేలి ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారు. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో మృతులంతా ఐదు నుంచి 12 మధ్య వయస్సు వారేనని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చిన్నారులకు ఒక పేలుడు పదార్థం దొరకడంతో దాన్ని ఇంటికి తీసుకువచ్చారు. దానితో ఆడుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పిల్లల కుటుంబీకులు తెలిపారు. ఆ సమయంలో పెద్ద పేలుడు సంభవించిందని, అనంతరం పిల్లలు రక్తం ముద్దలై ఉన్నారని చెప్పారు.
భారత జవాన్ల హత్యల వెనుక పాక్‌ ఐఎస్‌ఐ పాత్ర!

భారత జవాన్ల హత్యల వెనుక పాక్‌ ఐఎస్‌ఐ పాత్ర!

కశ్మీర్‌ సరిహద్దులో ముగ్గురు ప్రత్యేక ఎస్వీవోలను పాక్‌ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. కశ్మీర్‌లో జవాన్ల హత్యలను తీవ్రంగా భావించిన భారత నిఘా వర్గాలు దీని వెనుక పాకిస్తాన్‌ గుఢచారి సంస్థ ఐఎస్‌ఐ పాత్ర ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. సైనికుల పేర్లను ఉగ్రవాదులకు చేరవేసి పక్కా ప్రణాళిక ప్రకారమే వారిని హతమార్చినట్లు ఐబీ వెల్లడించింది. ముందుగా వారిని విధుల నుంచి వైదొలగాల్సిందిగా ఉగ్రవాదులు హెచ్చరించారని అయినా కూడా జవాన్లు వారి బెదిరింపులకు లొంగకపోవడంతో కిడ్నాప్‌ చేసి అత్యంత హత్యచేసినట్లు అధికారులు తెలిపారు.
డెబిట్, క్రెడిట్ కార్డుతో పెట్రోలు పోయించుకుంటున్నారా.?

డెబిట్, క్రెడిట్ కార్డుతో పెట్రోలు పోయించుకుంటున్నారా.?

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా పెట్రోల్‌ పోయించుకునే వాహనాదారులకు షాకింగ్ న్యూస్. కస్టమర్లకు అందిస్తున్న డిస్కౌంట్లను తగ్గించాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భావిస్తున్నాయి. కార్డుల ద్వారా పెట్రోల్‌ పంపుల్లో చెల్లింపులు చేసే కస్టమర్లకు 0.75 శాతం డిస్కౌంట్‌ను ఇకపై తిరిగి చెల్లించరు. ఈ డిస్కౌంట్‌ను రానున్న కాలంలో ఎత్తివేసే అవకాశం ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవర్గాలు చెబుతున్నాయి.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more