Short News

విడుద‌ల‌కు ముందే బ్లాక్ మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌

విడుద‌ల‌కు ముందే బ్లాక్ మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌

గూగుల్‌ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాకముందే విక్రయానికి కూడా వ‌చ్చింది. అదీ బ్లాక్‌ మార్కెట్‌ ద్వారా. గూగుల్‌ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ హ్యాండ్స్‌-ఆన్‌ వీడియోను కూడా వైల్స్‌కామ్‌ పబ్లిష్‌ చేసింది. 2000 వేల డాలర్లకు గూగుల్‌ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌తో పాటు దీన్ని కూడా విక్రయిస్తున్నట్టు వైల్స్‌కామ్‌ చెప్పింది. అయితే కొట్టుకొచ్చి ఈ హ్యాండ్‌సెట్లను విక్రయిస్తున్నారని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై చర్యలకు తీసుకునేందుకు గూగుల్‌ సిద్ధమైంది.         
ఆసియాకప్‌ : హాంకాంగ్, భారత్ మ్యాచ్‌లో ‘జనసేన’ జెండా

ఆసియాకప్‌ : హాంకాంగ్, భారత్ మ్యాచ్‌లో ‘జనసేన’ జెండా

దుబాయ్ లో భారత్, హాంకాంగ్ మ్యాచ్ లో జనసేన జెండా మెరిసింది. పవన్‌కల్యాణ్‌పై ఉన్న అభిమానం క్రికెట్ స్టేడియంలో కూడా దర్శనమిచ్చింది. ఆడియన్స్ గ్యాలరీలో ఒక్కసారిగా జనసేన పార్టీ జెండా ప్రత్యక్షమైంది. పవన్‌కల్యాణ్ అభిమాని ఒకరు ఆడియన్స్‌లో కూర్చొని జనసేన జెండాని ప్రదర్శించాడు. దీంతో ఈ దృశ్యాన్ని స్క్రీన్‌షాట్ తీసి జనసేన, పవన్ అభిమానులు సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు.
హైకోర్టులో ఊరట: ‘ఔట్‌సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులకు పండగరోజు’

హైకోర్టులో ఊరట: ‘ఔట్‌సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులకు పండగరోజు’

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్(ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) సర్వీసును క్రమబద్దీకరించడాన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో విద్యుత్ శాఖలోని జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలలో పనిచేసే 23వేల మంది ఆర్టిజన్లను క్రమబద్దీకరించడానికి మార్గం సుగమమైంది.

అతడి స్టేచర్ ఏంటి? ఉరి తీయమనేవాడిని: మహేష్ బాబు ఇష్యూపై నరేష్

అతడి స్టేచర్ ఏంటి? ఉరి తీయమనేవాడిని: మహేష్ బాబు ఇష్యూపై నరేష్

మనోజ్ ప్రభాకరన్ అనే తమిళ కమెడియన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటనను అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడంపై ప్రముఖ నటుడు, మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్, 'మా' ప్రధాన కార్యదర్శి నరేష్ ఫైర్ అయ్యారు. భారత దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భాషల్లో సినీ పరిశ్రమలు ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ, తులు, భోజ్‌పురి, హిందీ, పంజాబీ, మరాఠీ ఇన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. తెలుగు ఇతర భాషల్లో, వారు తెలుగు నటిస్తుంటారు. ఒక సోదర భావంతో అన్ని పరిశ్రమల నటులు ముందుకు వెళుతున్న సమయంలో ఇలాంటివి మైత్రిని దెబ్బతీస్తున్నాయన్నారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more