Short News

ఐటెల్ నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు విడుదల

ఐటెల్ నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు విడుదల

మొబైల్స్ తయారీదారు ఐటెల్ మూడు నూతన స్మార్ట్‌ఫోన్లను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఐటెల్ ఎ45, ఎ22, ఎ22 ప్రొ పేరిట ఈ మూడు ఫోన్లు విడుదలయ్యాయి. ఐటెల్ ఎ45 రూ.5,999 ధరకు లభిస్తుండగా, ఎ22 రూ.5,499 ధరకు, ఎ22 ప్రొ రూ.6,499 ధరకు లభిస్తున్నది. ఐటెల్ ఎ45.. 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఐటెల్ ఎ22/ఎ22 ప్రొ 5 ఇంచ్ డిస్‌ప్లేలో లభిస్తుంది. ఈ మూడు స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
రక్షిత్ శెట్టి సినిమా నుండి తప్పుకున్న 'రష్మిక'

రక్షిత్ శెట్టి సినిమా నుండి తప్పుకున్న 'రష్మిక'

గోల్డెన్‌ గర్ల్‌ రష్మికా మందన్న తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా  మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల గీతగోవిందం సినిమాతో టాలీవుడ్‌లో రష్మికకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డ రష్మిక అతనితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. అయితే ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంగేజ్‌మెంట్ రద్దయింది. ఇప్పుడు రక్షిత్ హీరోగా నటిస్తున్న 'వ్రిత్రా' చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించి కన్నడ అభిమానులకు షాకిచ్చింది.
ధర్నాచౌక్: తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

ధర్నాచౌక్: తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఉమ్మడి హైకోర్టు మండిపడింది. ధర్నాచౌక్‌ ఎత్తివేతపై ఏడాదిగా ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై హైకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛను నియంత్రించవచ్చు కానీ.. పూర్తిగా అణచివేయరాదని ఉన్నత న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎక్కడో ఊరు బయట ధర్నా చేసుకుంటే ఎవరు వింటారని ప్రశ్నించింది. మనుషులు ఉండని అడవిలో సెల్‌ఫోన్‌ టవర్‌ నిర్మిస్తారా.. ఇదీ అలాగే అని వ్యాఖ్యానించింది.

అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నా

అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నా

తెలుగమ్మాయి చాందిని చౌదరి తెరమీద కన్నా షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారానే ఎక్కువ గుర్తింపునూ, క్రేజ్‌నూ సంపాదించుకుంది. ఇటీవల ఆమె నటించిన 'మను' చిత్రం విడుదలైంది. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవం సినిమాలో ఆమె చేసిన పాత్రా గూర్చి మాట్లాడింది. 'బ్రహ్మోత్సవంలో నాది చెల్లెలి పాత్ర అంటే చేయనన్నాను. తరువాత నాది మంచి పాత్ర అని ఒప్పించారు. ఆ సినిమాలో నాకు మహేష్‌బాబుతో ఫోటో తప్ప ఎలాంటి గుర్తింపు రాలేదు. ఈ సినిమా తరువాత ఇక ఎప్పుడూ అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. నాకు దాదాపు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి' అంటూ తెలిపింది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more