Short News

శాంసంగ్ 'గెలాక్సీ నోట్ 9' వచ్చేసింది

శాంసంగ్ 'గెలాక్సీ నోట్ 9' వచ్చేసింది

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఫోన్‌ను ఆవిష్కరించింది. దీనిలో 6.4 ఇంచుల భారీ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. గెలాక్సీ నోట్ 5 మాదిరిగా ఫోన్ ఎడ్జ్‌లను ప్రీమియం లుక్ లో తీర్చిదిద్దారు. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్, మెటాలిక్ కాపర్, ఓషియన్ బ్లూ కలర్ వేరియెంట్లలో లభ్యం కానుంది. దీనిలో అధునాతన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇండియన్ వేరియెంట్‌లో ఎగ్జినోస్ 9810ను ఏర్పాటు చేసారు.
రేపు సాయంత్రం వాజ్ పేయి అంత్యక్రియలు

రేపు సాయంత్రం వాజ్ పేయి అంత్యక్రియలు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు రేపు సాయంత్రం నిర్వహించనున్నారు. ప్రజలు, అభిమానులు, మద్దతుదారుల సందర్శనార్థం రేపు ఉదయం 9 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి వాజ్ పేయి పార్థివదేహాన్ని తరలించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సందర్శకులను అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో వాజ్ పేయి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు
నిపా వైరస్ తో చనిపోయిన నర్సు భర్త కేరళకు విరాళం

నిపా వైరస్ తో చనిపోయిన నర్సు భర్త కేరళకు విరాళం

భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ తన వంతు సాయం చేసేందుకు నిపా వైరస్ తో చనిపోయిన నర్సు భర్త ముందుకొచ్చారు. కేరళలో నిపా వైరస్‌ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి నర్సు లినీ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఆమే భర్త సాజీష్ వరదబాధితుల సహాయార్ధం తన మొదటి నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. లినీ మరణం తరువాత ఆమె భర్త సాజీష్‌ బహ్రెయిన్లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, తన ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం కోసం కేరళకు తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రి డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్‌కు చెక్‌ను కార్మికశాఖ మంత్రి రామకృష్ణన్‌కు అందించారు.
కేరళకు విరాళంగా 'గీత గోవిందం' కేరళ కలెక్షన్లు

కేరళకు విరాళంగా 'గీత గోవిందం' కేరళ కలెక్షన్లు

భారీ వర్షాలతో కేరళ అస్తవ్యస్తమైంది. ఈ వర్షాల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.దీంతో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కేరళకు వరద సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మొన్న గీతగోవిందం హీరో విజయదేవరకొండ తన వంతు సాయం ప్రకటించగా నేడు.. ఈ సినిమా నిర్మాత బన్నీవాసున కూడా వరద బాధితులకు విరాళం ప్రకటించాడు. కేరళలో 'గీత గోవిందం' ఎంత షేర్ ను రాబడుతుందో అంతమొత్తాన్ని ఆయన విరాళంగా అందజేయనున్నట్టు చెప్పారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more