Short News

ప్రతిభ అవార్డుల కోసం సెప్టెంబర్ 7లోపు దరఖాస్తు చేసుకోండి

ప్రతిభ అవార్డుల కోసం సెప్టెంబర్ 7లోపు దరఖాస్తు చేసుకోండి

ప్రతిభ అవార్డుల కోసం సెప్టెంబర్ 7లోపు దరఖాస్తు చేసుకోవాలని అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక జాతీయ కార్యదర్శి డాక్టర్ గణగళ్ల విజయ్ కుమార్ తెలిపారు. భారతీయ సంప్రదాయ కళలు, విద్య, వైద్యం, సమాజసేవ, పర్యావరణ పరిరక్షణ, నృత్యం, సంగీతం, సాహిత్యం, క్రీడలు, ఉపాధికల్పన రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డులు అందజేస్తారు. అక్టోబర్29న రవీంద్రభారతిలో ప్రతిభ అవార్డులను ప్రదానం చేయనున్నామని తెలిపారు. ఆసక్తి గల వారు 7780589775లో సంప్రదించాలని కోరారు.
విభిన్నంగా 'కంచరపాలెం' ట్రైలర్

విభిన్నంగా 'కంచరపాలెం' ట్రైలర్

న్యూయార్క్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా 'కంచరపాలెం'. నటుడు రానా నిర్మాతగా మారి, విడుదల చేస్తున్న ఈ చిత్రానికి వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించాడు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసారు. 'కంచరపాలెం' సినిమాను సమర్పిస్తుండటం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా ఓ గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని నమ్ముతున్నా. ఈ ఏడాది రాబోతున్న అతి పెద్ద చిన్న సినిమా ఇది' అంటూ రానా ట్వీట్‌ చేస్తూ ట్రైలర్‌ను పంచుకున్నారు.  
బాండ్ లపైనే టిడిపి ధీమా...గెలుపుపై అనుమానం లేదు

బాండ్ లపైనే టిడిపి ధీమా...గెలుపుపై అనుమానం లేదు

అమరావతి బాండ్లకు లభించిన స్పందనపై టిడిపి శ్రేణులు ఉప్పొంగిపోతున్నాయి. అమరావతి నిర్మాణానికి సీఆర్డీయే రూ.1300 కోట్ల విలువైన బాండ్లను జారీ చేయగా, గంటలోనే రూ.2వేల కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది అమరావతి నిర్మాణంపై ఉన్న విజన్‌, చంద్రబాబుపై నమ్మకమే కారణమని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి నిర్మాణానికి మోడీ ఇచ్చినదానికంటే బాండ్ల ద్వారా వచ్చిందే ఎక్కువని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. కేంద్రం రాజధానికి రూ. 1500 కోట్లు ఇచ్చి ఏవేవో మాటలు చెబుతోందని ఎద్దేవా చేశారు.

అన్నీ ఉచితమే: ‘కంటి వెలుగు’ ప్రారంభించిన కేసీఆర్

అన్నీ ఉచితమే: ‘కంటి వెలుగు’ ప్రారంభించిన కేసీఆర్

'కంటి వెలుగు' లాంటి కార్యక్రమం దేశంలోనే ఎక్కడా లేదని, ఇది తెలంగాణ సర్కారు మొదటి ప్రయత్నమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.కంటి వైద్యం కోసం ఏ ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కంటి జబ్బుల బారిన పడుతున్నారని, వృద్దులకు కంటి పరీక్షలు చాలా అవసరమని చెప్పారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more