Short News

భారీ వ‌ర్షంతో ఇబ్బందులు ప‌డ్డ హైద‌రాబాదీలు

భారీ వ‌ర్షంతో ఇబ్బందులు ప‌డ్డ హైద‌రాబాదీలు

హైద‌రాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం పూట ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సనత్ నగర్ పరిధిలోని ఎర్రగడ్డ, మోతీనగర్, మైత్రీ వనంలో వర్షం పడింది. రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, ఎస్‌ఆర్‌నగర్, అబిడ్స్, నాంపల్లి, సుల్తాన్ బజార్, బేగం బజార్, ఎల్బీనగర్‌లో మోస్తరు వర్షం పడింది.   
యూటర్న్‌’ పోస్టర్‌తో సెల్ఫీ దిగితే.. సమంతతో కలిసి ట్రైలర్ చూడొచ్చు

యూటర్న్‌’ పోస్టర్‌తో సెల్ఫీ దిగితే.. సమంతతో కలిసి ట్రైలర్ చూడొచ్చు

సమంత, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘యూటర్న్‌'. పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 17న విడుదల చేయనున్నారు. అయితే ట్రైలర్‌ను తనతోపాటు కలిసి ముందుగా చూడొచ్చని సామ్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. ‘ఆగస్టు 17న నాతో కలిసి ట్రైలర్‌ను చూడండి. ‘యూటర్న్‌' టీ షర్ట్‌ను పొందండి. మల్టీప్లెక్స్‌లో ‘యూటర్న్‌' పోస్టర్‌తో దిగిన సెల్ఫీని ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మాకు షేర్‌ చేయండి. కొంత మందిని ఎంపిక చేసి ట్రైలర్‌ విడుదల వేడుకకు ఆహ్వానిస్తాం' అని సమంత ట్వీట్‌ చేశారు.
కాంగ్రెస్‌లోకి రండి, అందరికీ ఉద్యోగాలు: తెలుగులో రాహుల్

కాంగ్రెస్‌లోకి రండి, అందరికీ ఉద్యోగాలు: తెలుగులో రాహుల్

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన విద్యార్థి - నిరుద్యోగ గర్జనలో తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాలుగు కోట్ల మంది ప్రజల పోరాట ఫలితం ఒక్క కేసీఆర్ కుటుంబానికి దక్కుతోందన్నారు. తెలంగాణలో యువత భవిష్యత్ ఆందోళనకరంగా ఉందన్నారు.కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. నీళ్లు, నిధులు, నియామకల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటులో విద్యార్థులది కీలకపాత్ర అన్నారు.

రాధ మూవీ రివ్యూ

రాధ మూవీ రివ్యూ

శతమానం భవతి లాంటి ఉత్తమ చిత్రాల్లో నటించిన శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం రాధ. ఈ చిత్రంలో తన లవర్ బాయ్‌ ఇమేజ్‌కు భిన్నంగా మాస్ క్యారెక్టర్‌ పోలీస్ పాత్రలో కనిపించారు. చంద్రమోహన్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి శర్వానంద్ చేసిన ప్రయత్నం ఫలించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకొందాం.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more