Short News

ఆ ప్రవేశాల్లో జోక్యమొద్దు: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం

ఆ ప్రవేశాల్లో జోక్యమొద్దు: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం

హైదరాబాద్ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. వైద్య, విద్యా ప్రవేశాల్లో ఇప్పటికే పూర్తయిన కౌన్సెలింగ్‌లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఇక నుంచి చేపట్టే ప్రవేశాల్లో జీవో 550ని యథావిధిగా అమలు చేయొచ్చని సూచించింది. జీవోలోని పేరా 5(2) న్యాయసమ్మతమే అయినా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో దానిని సక్రమంగా అమలుచేయలేరని అభిప్రాయపడింది. సాంకేతికతతో స్లైడింగ్‌ చేసినప్పటి నుంచే సమస్యలు వస్తున్నాయని, కౌన్సెలింగ్‌ను మాన్యువల్‌గా చేపట్టాలని సూచించింది.

తార‌క్‌ను ఏమీ అన‌ను.. దిష్టి త‌గులుతుంది!

తార‌క్‌ను ఏమీ అన‌ను.. దిష్టి త‌గులుతుంది!

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ'. తారక్‌కు సంబంధించిన కొత్త పోస్టర్లను రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే తారక్‌ ఫొటో గురించి ఆయన ఎలాంటి కామెంట్‌ చేయకుండా..‘నేనేమీ అనను దిష్టి తగులుతుంది' అని సరదాగా క్యాప్షన్‌ ఇచ్చారు. మ‌రోవైపు సెట్స్‌లో హీరోయిన్ ఈషా రెబ్బా తారక్‌, త్రివిక్రమ్‌తో కలిసి సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ..‘కూలెస్ట్‌ పీపుల్‌ ఆన్‌ సెట్స్‌ ఆఫ్‌ అరవింద సమేత' అని ట్వీట్‌ చేశారు.   
ఎన్నికల వేడి: సీఎం బస్సు మీద వరుస రాళ్ల దాడులు

ఎన్నికల వేడి: సీఎం బస్సు మీద వరుస రాళ్ల దాడులు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి జన ఆశీర్వాద్ యాత్ర పేరుతో శాసన సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. శాసన సభ ఎన్నికల్లో మళ్లీ మమ్మల్ని గెలిపించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రచారం చేస్తున్నారు. రోత్లమ్ జిల్లాలోని కలుకేది సమీపంలో సోమవారం రాత్రి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న హైటెక్ బస్సు మీద రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎలాంటి గాయాలు కాకపోయినా బస్సు దెబ్బతింది.

టీమిండియా సిద్ధమ‌న్న రోహిత్‌.. ఎంజాయ్ చేయ‌మ‌న్న స‌ర్ఫ‌రాజ్‌

టీమిండియా సిద్ధమ‌న్న రోహిత్‌.. ఎంజాయ్ చేయ‌మ‌న్న స‌ర్ఫ‌రాజ్‌

ఆసియా క‌ప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెండు జ‌ట్ల కెప్టెన్లు మాట్లాడారు.రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ ‘పాకిస్థాన్‌తో ఆడటానికి టీమిండియా సిద్ధంగా ఉంది. హాంకాంగ్‌పై గెలవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకున్నాం. ఇప్పుడు పాక్‌ విషయంలోనూ అదే పద్ధతి అనుసరిస్తాం' అని తెలిపాడు. సర్ఫ్‌రాజ్‌ మాట్లాడుతూ..‘మా జట్టు సభ్యులందరికీ నేను చెప్పేది ఒకటే. మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆడండి. భారత్‌లో దీటైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. వారి దగ్గర్నుంచి మాకు సరైన సవాలు ఎదురవుతుంది' అని అన్నాడు.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more