Short News

ఎయిర్‌పోర్టులో చెంప దెబ్బ కొట్టార‌ని ఇట‌లీ డీజే ఫిర్యాదు

ఎయిర్‌పోర్టులో చెంప దెబ్బ కొట్టార‌ని ఇట‌లీ డీజే ఫిర్యాదు

శంషాబాద్‌లోని ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియాకు చెందిన సిబ్బంది తనను చెంప దెబ్బ కొట్టినట్లు ఇటలీకి చెందిన డీజే ఓలీ ఎస్సీ ఆరోపించింది. ఎయిర్ ఇండియా మాత్రం ఈ విష‌యాన్ని ఖండించింది. ఈ ఘటన పట్ల ఎయిర్‌పోర్ట్ ఇన్స్‌పెక్టర్ మహేశ్‌కు ఓలీ ఎస్సీ ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆల‌స్యం కావ‌డంపై తాను ఫిర్యాదు చేసేందుకు ఎయిర్ ఇండియా కౌంటర్ వద్దకు వెళ్లగా అక్క‌డ ఉన్న ఉద్యోగిని దురుస్తుగా ప్ర‌వ‌ర్తించింద‌ని గాయ‌ని ఆరోపించారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా కేసును విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.   
మరోసారి మనీషా యాదవ్ మెరుపులు

మరోసారి మనీషా యాదవ్ మెరుపులు

వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు వెట్రిమారన్ నిర్మాతగా మారి రామ్‌నాథ్‌ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నటి మనీషా యాదవ్‌ కథానాయకిగా నటించనుంది. తొలి చిత్రం 'వళక్కు ఎన్‌ 18/9' చిత్రంతో ప్రశంసలు అందుకున్న మనీషా తరువాత 'త్రిషా ఇల్లన్నా నయనతార' వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల ఒరు కుప్‌పెకథై చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి పేరు సాధించింది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్‌ నవంబర్‌లో సెట్‌పైకి వెళ్ళనుందని సమాచారం. దీనితో పాటు మనిషాను మరో చిత్రంలోనూ నటించనుంది.
చేదు వార్త: రైళ్లలో టీ, కాఫీ ధరలు పెరిగాయి, ఎంతంటే?

చేదు వార్త: రైళ్లలో టీ, కాఫీ ధరలు పెరిగాయి, ఎంతంటే?

రైలు ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా చేదువార్తే అని చెప్పాలి. రైళ్లలో అందించే టీ, కాఫీల రేట్లు పెరిగిపోయాయి. కొత్త రేట్ల ప్రకారం 150 మిలీ ఛాయ్ కప్పు గతంలో రూ.7 ఉండగా.. ఇప్పుడు కనీసధరను రూ.10 చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. అదేవిధంగా, కాఫీ ధరను కూడా రూ.10 లకు తగ్గకుండా ధరను పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. రెడీమేడ్ స్టాండర్డ్ టీ మాత్రం రూ.5లుగానే ఉంటుందని.. సాధారణ టీ విషయంలో ధర పెరగదని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

అమెరికాలో కాల్పులు: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

అమెరికాలో కాల్పులు: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటలకు హార్ఫర్డ్ కౌంటీలోని పెరీమాన్ ప్రాంతంలో ఉన్న ఓ ఫార్మసీ కేంద్రం దగ్గర ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆ ప్రాంతంలో సంచరించొద్దని అధికారులు హెచ్చరించారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more