Short News

పిడికిలి బిగించి అమర్ రహే అని కేసీఆర్ నినాదం

పిడికిలి బిగించి అమర్ రహే అని కేసీఆర్ నినాదం

కరుణానిధి మృతి వార్త విని పలువురు డీఎంకే కార్యకర్తల గుండె ఆగింది. దాదాపు చాలామంది మధ్య వయస్సు నుంచి వృద్ధులు చనిపోయారు. కరుణానిధి ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచే పలువురు ఆవేదనకు లోనయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని చాలామంది ఆందోళనకు లోనయ్యారు. మృతి చెందిన విషయం తెలియగానే అది తట్టుకోలేక దాదాపు 17 మంది కన్నుమూశారు.బుధవారం రాజాజీ హాలులో కరుణానిధిని కడసారి చూసేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, డీఎంకే కార్యకర్తలు భారీగా చెన్నైకి తరలి వచ్చారు.

షిప్ నుంచి జారి సముద్రంలోనే పది గంటలు చిక్కుకుంది

షిప్ నుంచి జారి సముద్రంలోనే పది గంటలు చిక్కుకుంది

క్రూయిజ్‌షిప్ ఎక్కిన ఓ మహిళ జారి పడి సముద్రంలోనే పదిగంటలు చిక్కుకుంది. ఆ తర్వాత క్షేమంగా బయటపడింది. నౌక ఏడ్రియాటిక్ తీరంలో ప్రయాణిస్తుండగా ఆమె డెక్ మీద నుంచి జారి సముద్రంలో పడిపోయింది. అదీ అర్ధరాత్రి. చుట్టూ చిమ్మచీకటి. గడ్డకట్టించే చలి. అలా అలా సముద్రంలో తేలుతూ పదిగంటలపాటు గడిపింది. అన్వేషణ బృందాలు ఆమె పడిపోయిన చోట సముద్రపు అలలను గాలించాయి. ఎట్టకేలకు ఆమె కనిపించడంతో కథ సుఖాంతమైంది. ఈ ఘటన జరిగిన స్థలం క్రొయేషియా తీరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాము రక్షించే సమయానికి ఆమె తీవ్రంగా అలసిపోయి ఉందని షిప్ కెప్టెన్ తెలిపారు.
చిరంజీవిని పబ్లిక్‌గా ముద్దు పెట్టుకొన్న సీనియర్ నటి!

చిరంజీవిని పబ్లిక్‌గా ముద్దు పెట్టుకొన్న సీనియర్ నటి!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక మందన్న నటించిన గీతా గోవిందం చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అందులో నటించిన నటీనటులను పేరు పేరునా అభినందించారు. ఈ సందర్భంగా సీనియర్ నటి అన్నపూర్ణను ప్రత్యేకంగా అభినందించారు. తనకు ఎన్నో చిత్రాల్లో అమ్మగా నటించారు.

వ‌ర‌ద‌ల‌పై న‌కిలీ వార్తలు.. చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న కేర‌ళ సీఎం

వ‌ర‌ద‌ల‌పై న‌కిలీ వార్తలు.. చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న కేర‌ళ సీఎం

కేరళ ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతోపాటు నకిలీ వార్తలతోనూ పోరాడుతున్నది. ఏకంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఓ నకిలీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇలాంటి వాటిని నమ్మొద్దని ఇండియన్ ఆర్మీకి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తన ట్విటర్ పేజ్‌లో కోరింది. కేరళ వరదల్లో చిక్కుకున్న వాళ్లంతా బాగా డబ్బున్న వాళ్లని వాళ్లకు ఎలాంటి సాయం చేయాల్సిన అవసరం లేదని సురేశ్ కొచ్చాట్టిల్ అనే వ్య‌క్తి దీంతో కేర‌ళ సీఎం విజయన్ రంగంలోకి దిగి ఇలాంటి నకిలీ వార్తలను వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more