Short News

కేకేఆర్‌కు బిగ్ షాక్: ఐపీఎల్ 2026 నుంచి స్టార్ బౌలర్ ఔట్!

కేకేఆర్‌కు బిగ్ షాక్: ఐపీఎల్ 2026 నుంచి స్టార్ బౌలర్ ఔట్!

హర్షిత్ రాణా IPL 2026 నుండి వైదొలగడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది; బ్లెస్సింగ్ ముజారబానీ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది, రస్సెల్ రిటైర్మెంట్ ప్రణాళికలపై ప్రభావం చూపుతుంది.
సై అంటే సై.. నువ్వా-నేనా అంటున్న రెండు కార్లు

సై అంటే సై.. నువ్వా-నేనా అంటున్న రెండు కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో మంచి పనితీరు, సరిపడే ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చు కావాలనుకునే వినియోగదారులు ఈ సెగ్మెంట్ కార్లను ఎక్కువగా ఎంచుకుంటారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన ఈ చిన్న కార్లు మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి కూడా మంచి ఎంపికగా నిలుస్తాయి. ఈ విభాగంలో ప్రముఖంగా చెప్పుకునే రెండు కార్లు టాటా టియాగో (Tata Tiago), హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios). భారత మార్కెట్లో సరసమైన ధరతో పాటు విశ్వసనీయత కలిగిన ఈ రెండు మోడళ్లు వినియోగదారుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. ఈ రెండు కార్ల మధ్య తేడాల గురించి ఈ కింది కథణంలో చూద్దాం.
కొత్త కలర్‌‌తో బర్గ్‌మాన్ స్ట్రీట్ EX ఆకట్టుకుంటోంది!

కొత్త కలర్‌‌తో బర్గ్‌మాన్ స్ట్రీట్ EX ఆకట్టుకుంటోంది!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ (Suzuki Motor Corporation)కు అనుబంధంగా పనిచేస్తున్న సుజుకి మోటార్ సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భారత మార్కెట్లో మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తన ప్రీమియం స్కూటర్ సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ ఈఎక్స్ (Suzuki Burgman Street EX) కోసం పెర్ల్ గ్రే వైట్ అనే కొత్త కలర్ ఆప్షన్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ కొత్త రంగు స్కూటర్‌కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడంతో పాటు స్పోర్టీ లుక్‌ను కూడా పెంచుతుంది. యువతను ఆకట్టుకునేలా ఈ కలర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త కలర్ ఎంట్రీతో ఇప్పుడు బర్గ్‌మాన్ స్ట్రీట్ EX స్కూటర్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.
ఐ ఫోన్ కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్

ఐ ఫోన్ కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్

పెట్రోల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్న నేపథ్యంలో, సామాన్యుడి చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు, ప్రతిరోజూ ఆఫీసులకు లేదా పనులకు వెళ్లేవారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక వరంగా మారాయి. ఈ విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ తన అద్భుతమైన సృష్టి టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)తో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 2026 కొత్త మోడల్స్ మరింత రేంజ్, స్మార్ట్ ఫీచర్లు, అత్యంత తక్కువ ధరతో వినియోగదారుల ముందుకు వచ్చాయి. కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, కారులో ఉండేలాంటి పెద్ద డిస్‌ప్లే, అదిరిపోయే వేగంతో ఈ స్కూటర్ ఇప్పుడు మార్కెట్ లీడర్‌గా ఎదిగింది.