Short News

పవన్ నిచ్చెనగా.. తెలంగాణలోను కలుద్దాం: పవన్‌కు సీపీఎం

పవన్ నిచ్చెనగా.. తెలంగాణలోను కలుద్దాం: పవన్‌కు సీపీఎం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. తెలంగాణలో కూడా మీతో కలిసి పని చేయాలని ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి తెలంగాణలోను కలిసి పని చేద్దామని ఈ మేరకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తమ్మినేని ప్రతిపాదనపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించింది. ఆయనతో ముఖాముఖి మాట్లాడాలని నిర్ణయించింది. ఈ మేరకు జనసేన నేత హరిప్రసాద్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంటులో ఆ లేఖను పోస్ట్ చేశారు.

బిగ్ బాస్ తెలుగు: ఈ వారం ఎలిమేనేట్ అయ్యే వ్యక్తి ‘రోల్ రైడా’?

బిగ్ బాస్ తెలుగు: ఈ వారం ఎలిమేనేట్ అయ్యే వ్యక్తి ‘రోల్ రైడా’?

తెలుగు టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న బిగ్ బాస్ సీజన్-2 ముగింపు దశకు చేరుకున్నది. అయితే ఈ వారంలో రోల్ రైడా ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. గుడ్లు జాగ్రత్త టాస్క్ లో రోల్ రైడా ఓడిపోవడంతో, ఫైనల్ వారానికి వెళ్లే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని, ఈ వారంలో దీప్తి నల్లమోతు, గీతా మాధురి కన్నా రోల్, సామ్రాట్ లకు తక్కువ ఓట్లు రావడం, ఇప్పటికే సామ్రాట్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించడంతో రోల్ వెళ్లిపోనున్నాడని తెలుస్తోంది. రోల్ వెళ్లిపోతే, బిగ్ బాస్ లో ఫైనల్ వీక్ లో తనీష్, గీత, దీప్తి, కౌశల్, సామ్రాట్‌ ల మధ్య పోటీ సాగుతుంది.
శాంతిచర్చలు: తిరస్కరించిన భారత్‌పై ఇమ్రాన్ అక్కసు

శాంతిచర్చలు: తిరస్కరించిన భారత్‌పై ఇమ్రాన్ అక్కసు

ఓ వైపు సరిహద్దుల్లో సైన్యాన్ని చంపుతూ, మరోవైపు చర్చలకు పాకిస్తాన్ పిలవడాన్ని భారత్ తిప్పికొట్టింది. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని చర్చలకు సిద్ధమని ప్రకటించగా, తొలుత భారత్ సిద్ధపడింది. కానీ ఆ తర్వాత చర్చలకు విముఖత చూపింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. భారత్ పైన అక్కసు వెళ్లగక్కాడు. శాంతి కోసం చర్చలు జరపడానికి తాను ఇచ్చిన పిలుపునకు భారత్‌ దురహంకారంగా, ప్రతికూలంగా ఇచ్చిన సమాధానం నిరాశపరిచిందని, గొప్ప స్థానంలో కూర్చొని గొప్ప లక్ష్యాలు లేకుండా పని చేసేవారిని తన జీవితంలో చాలా మందిని చూశానని ఆయన ట్వీట్‌ చేశారు.

పక్కనే అందమైన అమ్మాయి ఉన్నా ‘దాసు’ పట్టించుకోడు

పక్కనే అందమైన అమ్మాయి ఉన్నా ‘దాసు’ పట్టించుకోడు

నాగ్‌, నాని హీరోలుగా నటించిన చిత్రం ‘దేవ్‌దాస్'. శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాగ్‌ దేవా పాత్రలో, నాని దాస్‌ పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా నాగ్‌ ఓ ఆసక్తికరమైన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. నాగ్‌ తన ఫోన్‌లో ఏదో చూసుకుంటూ బిజీగా ఉండగా ఓ వ్యక్తి వెళ్లి ఆయన్ని పలకరిస్తాడు. ‘ఏదో అడిగారు..ఓ ఇదా..ఫోన్‌తో బిజీ. దాస్‌కు ఇదొక అలవాటుగా మారిపోయింది. ఆ ఫోన్‌లో ఏం చూస్తుంటాడో నాకు తెలీదు. పక్కన అందమైన అమ్మాయి ఉన్నా కూడా పట్టించుకోడు. ఫోన్‌ను పట్టుకుని అలా చూస్తూ ఉంటాడని చెప్పాడు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more