కియా, హ్యుందాయ్ కంపెనీలకు పోటీ ఇవ్వనున్న కొత్త స్కోడా SUV
ఆటోమొబైల్స్
- 4 month, 13 days ago
ప్రముఖ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఒక భారీ అడుగు వేసింది. భారత్‌లో ప్రస్తుతం ఐసీఈ (ICE) పెట్రోల్, డీజిల్ కార్లపై ఫోకస్ చేస్తున్న ఈ కంపెనీ, గ్లోబల్ మార్కెట్ల కోసం తమ మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్కోడా పీక్ (Skoda Peaq)ను అధికారికంగా ఆవిష్కరించింది. స్కోడా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో ఇది అత్యంత టాప్ ఎండ్ మోడల్‌గా నిలవనుంది. ఇది మార్కెట్లోకి వస్తే.. ప్రస్తుతం లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో ఉన్న కియా EV9, హ్యుందాయ్ ఐయోనిక్ 9, వోల్వో EX90 వంటి ఫుల్ సైజ్ లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సరికొత్త స్కోడా పీక్ ఎలక్ట్రిక్ కారును కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా 60, 90, 90x అనే మూడు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని బేస్ వేరియంట్ పీక్ 60లో 63kWh బ్యాటరీని ఇచ్చారు, ఇది 459 కిమీల రేంజ్‌ను, 204hp పవర్‌ను జనరేట్ చేస్తుంది.