ఈ కారును 107 మంది మాత్రమే కొన్నారు
ఆటోమొబైల్స్
- 4 month, 5 days ago
ఎంజీ మోటార్ (MG Motor) కంపెనీ భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మంచి గుర్తింపును సంపాదిస్తోంది. ముఖ్యంగా విండ్సర్ ఈవీ, కామెట్ ఈవీ వంటి మోడళ్లతో యువతతో పాటు నగర వినియోగదారులను బాగా ఆకర్షిస్తోంది. తక్కువ రన్నింగ్ ఖర్చు, ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఎంజీ పేరు ఇప్పుడు ప్రధానంగా ఈవీ మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఐసీఈ కార్ల విభాగంలో మాత్రం కంపెనీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా ఎంజీ ఆస్టర్ (MG Astor) అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.