ఈ SUV డ్రైవ్ చేస్తే షాక్ అవుతారు.. 2026 టైగన్ పూర్తి రివ్యూ!
ఆటోమొబైల్స్
- 4 month, 22 days ago
2020 సంవత్సరం. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి ప్రభావంతో ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక గందరగోళంలో ఉండగా, అదే సమయంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020లో ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) "టైగన్ (Taigun)" అనే కాంపాక్ట్ SUV ప్రోటోటైప్‌ను పరిచయం చేసింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే ఫోక్స్‌వ్యాగన్ T-Roc ఆధారంగా రూపొందించినప్పటికీ, భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా మార్చిన MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. 2021 సెప్టెంబర్‌లో భారతదేశంలో విక్రయాలకు వచ్చిన టైగన్, కరోనా ప్రభావం తర్వాత దేశం మళ్లీ ముందుకు కదులుతున్న సమయంలో మార్కెట్లోకి ప్రవేశించింది. ఇదే మోడల్ మెక్సికోలో అదే పేరుతో, ఇండోనేషియాలో T-Roc పేరుతో ఎగుమతి చేయబడింది.