ఆటోగా మారిపోయే స్కూటర్.. ఇది నిజంగా ఇంజనీరింగ్ అద్భుతం
ఆటోమొబైల్స్
- 5 month, 26 days ago
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏ స్థాయిలో పెరుగుతుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ రంగంలో ఒక సరికొత్త విప్లవానికి హీరో మోటోకార్ప్ తెరతీసింది. ఒకే వాహనం.. అవసరమైతే మూడు చక్రాల ఆటోగా, వద్దనుకుంటే రెండు చక్రాల స్కూటర్‌గా మారిపోయే అద్భుత టెక్నాలజీని మన ముందుకు తెచ్చింది. అదే హీరో సర్జ్ S32 (Hero Surge S32). ఈ వినూత్న వాహనానికి భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆమోదం లభించింది.