ఇవి కార్లు కాదు ప్రాణాలు కాపాడే బాడీగార్డులు
ఆటోమొబైల్స్
- 6 month, 3 days ago
ఒకప్పుడు కారు కొనేటప్పుడు కేవలం మైలేజీ, తక్కువ ధర మాత్రమే చూసేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. రోడ్డు ప్రమాదాల భయం పెరగడంతో, ప్రాణాలకు రక్షణ ఇచ్చే సేఫ్టీ ఫీచర్లకు జనం పెద్దపీట వేస్తున్నారు. కారు బాడీ ఎంత బలంగా ఉంటే అంత సురక్షితం అనే నమ్మకం పెరిగింది. అందుకే మన దేశంలో తయారవుతున్న కార్లు కూడా ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లోహపు కోటల మాదిరిగా వస్తున్నాయి. ముఖ్యంగా 10 లక్షల రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లోనే గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) లేదా బి-ఎన్‌క్యాప్ (BNCAP) నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకున్న టాప్-5 కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఆ అదిరిపోయే కార్ల వివరాలు తెలుసుకుందాం.