చూపు తిప్పుకోనివ్వని అందం..ఆడి ఫ్యామిలీలోకి కొత్త అతిథి
ఆటోమొబైల్స్
- 6 month, 15 days ago
జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి (Audi) తన క్యూ8 (Q8) లైనప్‌ను భారత్‌లో మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. వేగాన్ని, విలాసాన్ని కోరుకునే వారి కోసం సరికొత్త ఆడి ఎస్‌క్యూ8 (Audi SQ8) పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని మార్చి 17న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కారు కోసం బుకింగ్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ.5 లక్షల టోకెన్ అమౌంట్‌తో ఆడి అధికారిక వెబ్‌సైట్ లేదా myAudi Connect యాప్ ద్వారా తమ కలల కారును రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కొత్త మోడల్ సాధారణ క్యూ8 వెర్షన్‌కు, అత్యంత శక్తివంతమైన ఆర్‌ఎస్ క్యూ8 (RS Q8)కు మధ్యలో ఉంటుంది. దీని ధరలను లాంచ్ రోజైన మార్చి 17న అధికారికంగా వెల్లడించనున్నారు.