ఫుల్ ట్యాంక్ చేస్తే 700 కిమీ మైలేజ్ ఇచ్చే బైక్

ప్రతి రోజూ ఆఫీసుకో లేదా వ్యాపార పనుల మీద పల్లెటూరి రోడ్లపైన, సిటీ ట్రాఫిక్‌లోనూ ప్రయాణించాల్సి వస్తోందా? పెట్రోల్ ధరలు చూస్తే భయమేస్తుందా? అయితే మీ కోసమే టీవీఎస్ (TVS) సంస్థ అదిరిపోయే మైలేజీ ఇచ్చే స్టార్ సిటీ ప్లస్ (Star City Plus) బైక్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.72,500 ధరతో ప్రారంభమయ్యే ఈ బైక్, మధ్యతరగతి ప్రజలకు ఒక వరప్రసాదం అని చెప్పొచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ, సిట్టింగ్ కంఫర్ట్ కారణంగా ఈ బైక్ ఎన్నాళ్లుగానో మార్కెట్లో రారాజుగా వెలుగుతోంది. ముఖ్యంగా పల్లెటూరి రోడ్లపై కూడా ఇది చాలా స్మూత్‌గా వెళ్తుంది.

జూపిటర్ 110, జూమ్ 110లో అసలు బెస్ట్ ఏది?

భారతదేశంలో స్కూటర్ సెగ్మెంట్ రోజురోజుకీ మరింత పోటీతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన, నమ్మకమైన, సౌకర్యవంతమైన స్కూటర్లకు వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మంచి గుర్తింపు పొందిన మోడళ్లలో టీవీఎస్ జూపిటర్ 110 (TVS Jupiter 110) ఒకటి. ఈ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుని, కుటుంబాలకు అనువైన నమ్మకమైన వాహనంగా పేరు సంపాదించింది. ఇక మరోవైపు, Hero Xoom 110 కూడా ఈ సెగ్మెంట్‌లో మంచి పోటీని అందిస్తోంది. యువతను ఆకట్టుకునే స్టైలిష్ లుక్, ఆకర్షణీయమైన ఫీచర్లు, చురుకైన పనితీరు కారణంగా ఈ స్కూటర్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. వినియోగదారుల కోసం ఈ రెండు స్కూటర్ల గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

కుప్పకూలిన మారుతి కారు అమ్మకాలు

మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారత మార్కెట్లో ఫ్లాగ్‌షిప్ MPVగా గుర్తింపు పొందింది. ప్రీమియం ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కారు మంచి స్థాయిలో ఆకట్టుకునేలా రూపొందించబడింది. అయితే మార్కెట్లో ఈ కారు అమ్మకాలు మాత్రం స్థిరంగా లేకుండా పాము-నిచ్చెన ఆటలా ఎగబాకుతూ పడిపోతూ సాగుతున్నాయి. ఒక నెలలో కొంచెం పెరుగుదల కనిపిస్తే, మరో నెలలో గణనీయంగా తగ్గిపోతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, 2026 ఫిబ్రవరి నెలలో ఈ కారు అమ్మకాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఆ నెలలో కేవలం 143 యూనిట్లను మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయగలిగారు. గత సంవత్సరం అంటే 2025 ఫిబ్రవరి నెలలో మాత్రం పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండేది.

మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!

మిథున రాశి 2026-2027 జ్యోతిష్యం మెరుగైన ఆదాయం, విజయవంతమైన భాగస్వామ్యాలు మరియు సహాయక కుటుంబ డైనమిక్స్‌ను అంచనా వేస్తుంది. అంతర్దృష్టులు పని, విద్య, గృహనిర్మాణం మరియు ఆరోగ్యాన్ని కవర్ చేస్తాయి.
Advertisement

ప్రపంచంలోనే రెండో దేశంగా భారత్.. పాకిస్థాన్ గుండెల్లో గుబులు..!!

SIPRI విశ్లేషణ 2021-2025 సంవత్సరానికి యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా చూపిస్తుంది, భారతదేశం ప్రపంచంలోని అగ్ర దిగుమతిదారులలో ఒకటిగా ఉంది మరియు సరఫరాదారుల వైవిధ్యీకరణను హైలైట్ చేస్తూ చైనా టాప్ టెన్ నుండి నిష్క్రమించింది.

మహీంద్రా కారుకు జనాల నీరాజనం

భారతదేశంలో సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత పోటీతత్వంగా మారింది. ఈ విభాగంలో అనేక కంపెనీలు తమ మోడళ్లతో మార్కెట్‌లో పోటీ పడుతున్నప్పటికీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO) మాత్రం ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ముందుగా Mahindra XUV300 పేరుతో మార్కెట్‌లో ఉన్న ఈ మోడల్, కొత్త అవతారంలో XUV 3XOగా ప్రవేశించిన తర్వాత మరింత ఆదరణ పొందుతోంది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన పనితీరుతో ఈ కారు వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో చాలా మోడళ్లు ఉన్నప్పటికీ, XUV 3XO తన ప్రత్యేకతతో నిలుస్తోంది. నగరాల్లో డ్రైవింగ్‌కు అనుకూలమైన పరిమాణం, ప్రీమియం ఫీచర్లు, మంచి పనితీరు కారణంగా ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది.

LPG Cylinder: బ్లాక్ లో 1500 దాటేసిన గ్యాస్ సిలెండర్ ? చాపకింద నీరులా వార్ ఎఫెక్ట్..!

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ధరల పెరుగుదల మరియు తగినంత నిల్వ స్థాయిలు ఉన్నాయని ప్రభుత్వం హామీ ఇవ్వడం వలన భారతదేశంలో LPG సరఫరా యొక్క విశ్లేషణ.

హంటర్ 350 కొనడం లాభమా.. నష్టమా?

రోడ్డు మీద దర్జాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ ఆ బైకుల బరువు, ఎత్తు చూసి చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం, ముఖ్యంగా యువత మనసు దోచుకోవడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన మాస్టర్ పీస్ హంటర్ 350 (Royal Enfield Hunter 350). కేవలం రూ.1.38 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ బైక్, ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. అయితే, షోరూమ్‌కి వెళ్లి బుక్ చేసే ముందు ఈ బైక్ గురించి కొన్ని కీలక విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.

బంగారం ఢమాల్! ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు ప్రాంతీయ అస్థిరత మధ్య డాలర్ బలం, రేటు అంచనాలు మరియు సురక్షిత ఆస్తులకు పెట్టుబడిదారుల మార్పు డిమాండ్‌ను ప్రభావితం చేయడంతో బంగారం మరియు వెండి వెనక్కి తగ్గాయి.

భార్యకు అల్లు అర్జున్ ఇచ్చిన లగ్జరీ మెర్సిడెస్ ఇదే!

టాలీవుడ్‌లో తన స్టైల్, డ్యాన్స్, యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరు. అభిమానులు ప్రేమగా ఆయనను ఐకాన్ స్టార్ అని పిలుస్తారు. సినిమాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఆయన పేరు సంపాదించారు. ముఖ్యంగా తన భార్య స్నేహా రెడ్డి(Sneha Reddy)తో ఆయనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్చి 6న అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ ప్రత్యేక రోజును మరింత గుర్తుండిపోయేలా చేయాలని భావించిన అల్లు అర్జున్, తన భార్యకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు.

మహీంద్రా కంపెనీకి శనిలా పట్టిన 7 సీటర్

భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి. స్కార్పియో, థార్, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లతో మార్కెట్‌ను ఏలుతోంది. కానీ ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్టే, మహీంద్రా కంపెనీలో ఒక మోడల్ మాత్రం ఇప్పుడు అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. అది మరేదో కాదు, ఒకప్పుడు ఎంతో ఆశలతో విడుదల చేసిన ఎంపీవీ (MPV) మహీంద్రా మరాజో (Mahindra Marazzo). తాజా అమ్మకాల నివేదికల ప్రకారం, ఈ కారు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే.. గత ఫిబ్రవరి 2026 నెలలో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదు. అంటే జీరో (0) సేల్స్ నమోదయ్యాయి.

ఎండాకాలం లో రాగి జావ..బార్లీ జావ- ఎవరికి ఏది మంచిది..!!

గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణ మరియు మధుమేహం కోసం రాగి మరియు బార్లీలను పోల్చండి. భారతీయ ఆహారంలో ఫైబర్, గ్లూటెన్ కంటెంట్ మరియు ఆచరణాత్మక రోజువారీ భోజన మార్పిడుల గురించి తెలుసుకోండి.
Advertisement

కొత్త హ్యుందాయ్ వెర్నా వచ్చేసింది

దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ వెర్నా (Hyundai Verna) భారత మార్కెట్లో ప్రముఖ మిడ్-సైజ్ సెడాన్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. స్టైలిష్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ, సౌకర్యవంతమైన క్యాబిన్‌తో ఈ కారు చాలా కాలంగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు కంపెనీ ఈ సెడాన్‌ను 2026 అప్‌డేట్‌తో మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చింది. కొత్త వెర్నా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.98 లక్షల నుంచి రూ. 18.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ తాజా వెర్షన్‌లో బాహ్య రూపం, అంతర్గత డిజైన్, ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేసి, కారును మరింత ప్రీమియంగా మార్చారు.

యుద్దం ఎఫెక్ట్ : పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!!

ప్రపంచ ముడి చమురు ధర 110 డాలర్లకు చేరుతున్నప్పటికీ, పన్ను విధానం, కంపెనీ ధరల నిర్ణయం మరియు మారకం రేటు వంటి అంశాల సహాయంతో భారతదేశంలో రిటైల్ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన!

AI వినియోగం పెరుగుతున్నందున విస్తృత ఉద్యోగాల కోతలకు ఎటువంటి ప్రణాళికలు లేవని టెక్ మహీంద్రా పేర్కొంది, AI మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లలో ఉద్యోగుల స్థిరత్వం మరియు ప్రతిభను తిరిగి వినియోగించడంపై నొక్కి చెప్పింది.

రెండు అదిరిపోయే బైక్స్.. ఏది బెస్ట్?

హోండా షైన్ 125 (Honda Shine 125) లిమిటెడ్ ఎడిషన్ భారత మార్కెట్లో చాలా కాలంగా ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌గా గుర్తింపు పొందింది. మంచి మైలేజ్, సింపుల్ డిజైన్, విశ్వసనీయమైన ఇంజిన్ కారణంగా ఈ బైక్‌కు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు మంచి డిమాండ్ ఉంది. మరోవైపు హీరో గ్లామర్ ఎక్స్ 125 (Hero Glamour X 125) కూడా ఇదే సెగ్మెంట్‌లో బలమైన పోటీని ఇస్తోంది. స్టైలిష్ డిజైన్, మెరుగైన ఫీచర్లు, మంచి పనితీరు వల్ల ఇది యువతలో ఎక్కువగా ఆకర్షణ పొందుతోంది. ఈ రెండు కూడా భారత పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తూ రోజూ ప్రయాణంలో తోడుగా నిలుస్తాయి. ఇప్పుడు ఈ కథణంలో ఈ రెండు బైకుల గురించిన తేడాల గురించి తెలుసుకుందాం.

కార్ల ప్రపంచంలో మహా విప్లవం

సినిమా హాల్‌లో కొత్త సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తామో, కార్ల మార్కెట్‌లో కూడా కొత్త మోడళ్ల కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు జనం. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియాలో ఎస్‌యూవీ (SUV) కార్లకు ఉన్న డిమాండ్ చూసి, ప్రముఖ కంపెనీలు రెనాల్ట్ (Renault), నిస్సాన్ (Nissan) గట్టి ప్లాన్ వేశాయి. టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా, రాబోయే మూడేళ్లలో ఏకంగా 5 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయబోతున్నాయి. 2028 నాటికి ఈ కార్లన్నీ రోడ్ల మీద రయ్‌రయ్‌మంటూ తిరగనున్నాయి. ఈ లేటెస్ట్ ఎస్‌యూవీల ప్రత్యేకతలు ఏంటి? అవి ఎప్పుడు వస్తాయి? లాంటి వివరాలు తెలుసుకుందాం.

కస్టమర్లు రాక దోమలు కొట్టుకుంటున్న డీలర్లు

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో చిన్న కార్ల విభాగంలో ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఒకటి. సరసమైన ధర, మంచి మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం వంటి కారణాల వల్ల ఈ కారు సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబాలకు నచ్చిన ఎంపికగా నిలిచింది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది చాలా మందికి ప్రాధాన్యమైన కారుగా మారింది. అయితే, ఇటీవల కాలంలో ఈ కారుకు ఉన్న డిమాండ్ మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, 2026 ఫిబ్రవరి నెలలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపించింది. ఆ నెలలో మొత్తం కేవలం 862 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి.

కార్ల ఉత్పత్తిని సగానికి తగ్గించిన టాటా

మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగాన్ని, ముఖ్యంగా స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ పై జరిపిన దాడులు, ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమ ఆసియా అట్టుడుకుతోంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేవలం యుద్ధ భూమికే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు, గ్యాస్ సరఫరాను అస్తవ్యస్తం చేశాయి. దీనివల్ల టాటా మోటార్స్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తిని భారీగా తగ్గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఈ టాప్ డీజిల్ ఎస్‌యూవీల్లో మీ ఛాయిస్ ఏది?

ప్రస్తుత ఆటోమొబైల్ మార్కెట్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నప్పటికీ, డీజిల్ ఇంజిన్ల పట్ల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్‌లు వెళ్లే వారికి, కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వారికి డీజిల్ ఇంజిన్ ఇచ్చే పవర్ (టార్క్), మైలేజ్ మరే ఇంజిన్ ఇవ్వలేదు. భవిష్యత్తులో కఠినమైన పర్యావరణ నిబంధనల వల్ల డీజిల్ కార్ల తయారీ తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే మీరు పవర్‌ఫుల్ డీజిల్ కారు కొనాలనుకుంటే, మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Advertisement

విస్తరిస్తున్న డేంజరస్ వైరస్.. వ్యాక్సిన్ లేదు.. లక్షణాలు ఇవే..

యునైటెడ్ స్టేట్స్లో పెరుగుతున్న HMPV కేసుల అవలోకనం, లక్షణాలు, టీకా లేకపోవడం మరియు CDC మార్గదర్శక మద్దతు సంరక్షణ మరియు నివారణ చర్యలతో సహా.

మహిళా దినోత్సవం వేళ.. గౌతమ్ అదానీ ఎమోషనల్ మెసేజ్..

గౌతమ్ అదానీ తన తల్లి, భార్య మరియు కుమార్తెలు సహా తన విలువలను రూపొందించిన మహిళలను గౌరవిస్తారు మరియు అదానీ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం మరియు స్థిరమైన జీవనోపాధిలో చేస్తున్న కృషిని హైలైట్ చేస్తారు.

లక్షలు పెట్టి కొన్న కారు త్వరగా పాడవ్వకూడదా?

కొత్త కారు కొనడం ఎంత సంతోషాన్నిస్తుందో, దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలామంది కారు కొన్నాక కేవలం పెట్రోల్ పోయించడం, నడపడం మాత్రమే చేస్తుంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే లక్షలు పోసి కొన్న కారు కొద్ది రోజుల్లోనే ముసలిదైపోతుంది. మధ్యలో ఆగిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీ కారు కండీషన్‌ బాగుండాలంటే ఐదు ముఖ్యమైన విషయాలను మీరు క్రమం తప్పకుండా పాటించాలి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఈ కారును కొనే నాథుడే లేడు

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకికి తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటైన ఫ్రాంక్స్ (Fronx) విషయంలో ఇప్పుడు కొత్త తలపోటు మొదలైంది. ఐదుగురు కూర్చున్నా ఇంకా చోటు ఉంది అనిపించేంత విశాలమైన క్యాబిన్, అదిరిపోయే స్టైలిష్ లుక్‌తో దూసుకుపోతున్న ఈ కారు అమ్మకాలు ఒక్కసారిగా తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ క్రాస్ఓవర్ ఎస్‌యూవీ, ఇప్పుడు టాప్-10 జాబితాలో చిట్టచివరి స్థానానికి పడిపోవడంతో మారుతి సుజుకి యాజమాన్యం అప్రమత్తమైంది.

బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి!

వేగవంతమైన 5-నిమిషాల అధిక ప్రోటీన్ శనగల సలాడ్ భారతీయ అభిరుచులకు సరిపోతుంది, బరువు నియంత్రణకు మద్దతు ఇస్తుంది మరియు సాధారణ పదార్థాలు మరియు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న వస్తువులతో బిజీ ఉదయాలకు అనుకూలంగా ఉంటుంది.